తెలంగాణ రాష్ట్రం లో రైతు ఆత్మహత్యలు 3432 ప్రభుత్వం గుర్తించినవి 786

రాష్ట్రంలో ఆత్మహత్యలు 3,432

ప్రభుత్వం గుర్తించినవి 786

సిద్దిపేట జిల్లా నుండి ‘కిసాన్ ముక్తి సంసద్‘ కోసం ఢిల్లీ వచ్చిన 18 సంవత్సరాల మనీషా “మా అమ్మ,నాన్న వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు, నేను, నా తమ్ముడు కనీసం అన్నం తినటానికి అంత్యోదయ కార్డ్ కుడా ఇవ్వలేదు, మేమిద్దరం చదువు ఆపవలసిన పరిస్థితి ఏర్పడింది, నేను చదుకోవాలనుకుంటున్నాను, సమయానికి తినాలనుకుంటున్నాను. ఈ అంత్యోదయ కార్డులు,ప్రభుత్వ పధకాలు ఎవరికి వెళుతున్నాయి, ఇవి మా హక్కు కదా” అని నిలదీసింది.

యదాద్రి జిల్లా నుండి వచ్చిన స్వాతి “నా భర్త ఆత్మ హత్య చేసుకున్న రోజు నుండి పిల్లలకు అన్నం కూడా పెట్టలేక పోతున్న” అని కళ్లనీళ్ళ పర్యంతమైంది. నవంబర్ 20న ఢిల్లీలో జరిగిన చరిత్రాత్మకమైన కిసాన్ ముక్తి సంసద్ లో దేశం నలు మూలల నుండి వచ్చిన రైతుల సమస్యలే బాధాకరంగా ఉంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల సమస్యలు మరింత దిగ్బ్రాంతి కలిగించాయి. దేవరకొండ నుండి వచ్చిన సరోజ పరిస్థితి మరీ దారుణం. అప్పుల వాళ్ల బాధకు తట్టుకోలేక ఆమె పిల్లలతో గ్రామమే విడిచి వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మనీషా ,స్వాతి ,సరోజ లేవనెత్తిన సమస్యలు, అడిగిన విషయాలు కేవలం ఈ ముగ్గురు మహిళల సమస్యే కాదు దేశవ్యాప్తంగా ఈ రెండు దశాబ్దాలలో వ్యవసాయ సంక్షోభం వల్ల ఆత్మహత్య చేసుకున్న 3 లక్షల 18 వేల మంది రైతుల కుటుంబసభ్యులందరిదీ ఇదే సమస్య అని ఈ పాటికే అర్థమైవుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడున్నర సంవత్సరాలలో 3432 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడవలసిన పరిస్థితులు ఏర్పడాయి. భర్తలను కోల్పోయిన మహిళలు, ఇండ్లను, భూములను, చిన్న,చిన్న వస్తువులను , పశువులను, అమ్ముకొని అప్పులు తీరుస్తున్నారు. స్త్రీలు వలసలు వెళ్లి రోజువారీ కూలీలుగా మారుతున్నారు. ఆ కూలీతో పిల్లలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఆహారాలకు సరిపోక దినదిన గండంగా బతుకు వెళ్లదీస్తున్నారు. కాని రైతుల ఆత్మహత్యల గురించి ఎప్పుడు చర్చ జరిగినా ఏ ప్రభుత్వం ఉన్నపుడు ఎన్ని జరిగాయి అని లెక్కలు తీసి, కారణం మీరంటే, మీరు అంటూ చర్చను దారిమళ్లిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, గతంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు గతంలో ప్రభుత్వాల విధానాలు కారణం కావచ్చు కాని ఇప్పటి రైతు ఆత్మహత్యలను గుర్తించవలసిన బాధ్యత మాత్రం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైనే ఉంటుంది. కాని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు 3432 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే గుర్తించింది మాత్రం కేవలం 786 మంది మాత్రమే. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు సగటు వయస్సు 36 సంవత్సరాలు ,ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య సగటు వయస్సు 30 సంవత్సరాల లోపే. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ సగటు వయస్సు 63 సంవత్సరాలు,అంటే ఇంకా 33 సంవత్సరాల పాటు ఈ ఒంటరి మహిళలు కుటుంబ భారాన్ని, పిల్లల పోషణను చూసుకోవాలి. ఈ కుటుంబాలలోని మహిళలు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య భర్త పేరున ఉన్న కొద్దిపాటి భూమి తమ పేరున బదలాయింపు కాకపోవటం, దానికి స్థానిక అధికారులతో పాటు అత్తా,మామలు కూడా కారణం కావటం మరింత బాధాకరం. బాధిత కుటుంబాలలోని పిల్లలు బాల కార్మికులుగా మారవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆడ పిల్లలను చిన్న వయసులోనే చదువుకు దూరం చేసి పెళ్లి చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఈ కేసుల్లో వెంటనే విచారణ పూర్తి చేసి,అవసరమైతే పునర్విచారణ చేసి194 జి.వో. అమలుచేస్తే ఈ కుటంబాలు కొంతలో కొంతైనా ఈ దుస్థితి నుండి బయటపడతాయి. ఈ కుటుంబాలలోని పిల్లలను స్థానిక గురుకుల పాఠశాలలో వేసినట్లయితే బాలకార్మికులుగా మారే అవసరం వుండదు . ఆహార భద్రత క్రింద ఈ కుటుంబాలకు అంత్యోదయ ఇస్తే ఆకలితో అలమటించే పరిస్థితి నుండి కొంతైనా బయటపడతారు. భర్త పేరున ఉన్న భూమిని వెంటనే ఆమె పేరున మార్చాలి, అప్పుడే ఆమెకు బ్యాంకు లోనులు ప్రభుత్వ పథకాలు వర్తించి వ్యవసాయం చేసుకోగలరు. ఐనా ఇవన్నీ అలవికాని కోరికలు ఏమీకావు, ఆ కుటుంబాలలోని మహిళల కనీస హక్కులు.ప్రభుత్వ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ హక్కులు కాస్త కోరికల లాగా అనిపిస్తున్నాయి. నిజంగా వారి కనీస హక్కులైన తిండి, విద్య, గౌరవంగా జీవించే హక్కు(అప్పుల వారి నుండి విముక్తులు చేసి)లను అమలు చేస్తే వారి సమస్యలు చెప్పుకోవటానికి తెలంగాణ గల్లి నుండి ఢిల్లీ దాక పోయే పరిస్థితి వచ్చేదా?
మహిళా రైతుల ఆత్మహత్యలు
తెలంగాణ గత రెండు సంవత్సరాలుగా మహిళా రైతు ఆత్మహత్యలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది .దీనికి జాతీయ నేర పరిశోధన విభాగం లెక్కలే సాక్షం. మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలో పురుషుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది,ఆత్మహత్య చేసుకున్న వారి భర్తలు ఎక్స్ గ్రేషియా గురించి అధికారుల దగ్గరికి వెళితే వారు,మహిళలు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్ గ్రేషియా రాదని, ఆమె ఆత్మహత్య చేసుకుంటే, నీవేమి చేశావని, ఆడవారి మీద ఆధారపడ్డావా అంటూ మరింత అవమానానికి గురిచేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణ, అప్పుల వాళ్ళ వేధింపులు షరా మాములే. వీరు కనీసం పెన్షన్‌కు కూడా నోచుకోవటం లేదు, ఆహార భద్రత లేదు,మగవాళ్ళే అయివుండొచ్చు కాని వీళ్ళు ఒంటరి పురుషులే కదా,వీరికి కూడా గౌరవంగా బతికే హక్కు వుండాలి కదా. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వీరి హక్కులను కాపాడుతుందని ఆశిద్దాం,లేకుంటే వారంతా సంఘటితమై హక్కులు సాధించుకోవాలని కోరుకుందాం.
జి. ఒ. 194 ఏమి చెబుతుంది
ఏదైనా ఒక గ్రామంలో రైతు ఆత్మహత్య జరిగితే వెంటనే స్థానిక మండల త్రిసభ్య కమిటీ అధికారులు (తహసీల్దార్,వ్యవసాయ అధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్) ఆ కుటుంబాన్ని కలిసి ఆ రైతు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలి.ఆ రైతుకు వ్యవసాయం ఉన్న మాట వాస్తవమా, కాదా? వ్యవసాయంలో నష్టపోయి అప్పులు అయిన మాట వాస్తవమా, కాదా? తెలుసుకుని ఆ ఆత్మహత్య పై పూర్తి నివేదికను తయారు చేసి డివిజన్ స్థాయి త్రి సభ్య కమిటీ (ఆర్‌డిఒ,డిఎస్‌పి, ఎడిఎ)కి పంపాలి. అది రైతు ఆత్మహత్యనా కాదా అని నిర్ధారించే అధికారం మండల స్థాయి త్రి సభ్య కమిటీకి లేదు . మండల స్థాయి నుండి నివేదిక వచ్చిన వెంటనే డివిజన్ స్థాయి అధికారులు బాధిత కుటుంబాన్ని కలిసి విచారణ చేసి రైతు ఆత్మహత్యగా నిర్ధారిస్తే ఆ కుటుంబానికి రూ. 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయవలసిందిగా కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపాలి. ఎక్స్‌గ్రేషియా మంజూరు అయిన వెంటనే స్థానిక తహసిల్దార్, బాధిత కుటుంబ సభ్యులలో ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన వ్యక్తి పేరుతో బ్యాంకులో జాయింట్ ఎకౌంటు తీయాలి. వచ్చిన 6 లక్షల రూపాయలలో ఒక లక్ష రూపాయలతో అప్పుల వారందరినీ పిలిపించి తహసిల్దార్ వన్‌టైం సెటిల్మెంట్ చేయాలి. బాధిత కుటుంబ సభ్యులను అప్పుల వాళ్ళు ఇక ఎప్పుడూ వేధించకుండా తహసీల్దార్ తగిన సూచనలిచ్చి వారిని పూర్తిగా రుణ విముక్తులను చేయాలి. మిగిలిన 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి ఇచ్చి వారు జీవితంలో స్థిరపడే విధంగా సహకరించాలి. వారికి గృహ సౌకర్యం కల్పించాలి.పెన్షన్ మంజూరు చేయా లి. కుటుంబాలలోని పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలలో చేర్పించాలి. ఆ కుటుంబాలకు ఆహార భద్ర త క్రింద 35 కెజిల బియ్యం ఇచ్చే అంత్యోదయ అన్న యోజన సౌకర్యం కల్పించాలి. భవిష్యత్‌లో ఆ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు జరగకుండా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ క్రింద ఒక హెల్ప్ లైన్‌ను (టోల్ ఫ్రీ నెంబర్ తో) ఏర్పాటు చేయాలి.
కాని వాస్తవానికి ఏమి జరుగుతున్నది
ఒక రైతు ఆత్మహత్య జరిగిన వెంటనే విచారణ జరపవలసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఆ కుటుంబాన్ని సందర్శించక పోగా ఏ మండల రెవిన్యూ అధికారినో లేదా గ్రామ రెవిన్యూ అధికారినో కలిసి అది రైతు ఆత్మహత్య కాదని భార్య భర్తల గొడవ కారణంగా జరిగిన ఆత్మహత్య అని నిర్ధారిస్తారు. బిడ్డ పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో, ఇంటి నిర్మాణం కోసమో చేసిన అప్పు కారణమని నిర్ధారణ చేసి అది నిజమైన రైతు ఆత్మహత్య కాదని తేల్చేస్తారు. రైతు ఆత్మహత్య నిర్ధారణ ప్రక్రియలో తీవ్రంగా మోసపోతు న్న వారు కౌలు రైతులు. ఆత్మ హత్య చేసుకుంటున్న వారిలో 70 శాతం మంది కౌలు రైతులే. కాని వీరు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలలో ఎక్స్‌గ్రేషియా పొందటంలో వారి కుటుంబసభ్యులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు కౌలు రైతు గుర్తింపు కార్డు అడుగుతారు. కాని తెలంగాణలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 14 వేల మందికి ఈ ప్రభుత్వం కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. కౌలు రైతు ఆత్మహత్య జరిగినప్పుడు గుర్తింపు కార్డ్ కావాలంటే ఎక్క డి నుండి తెచ్చిస్తారు? ఇలా ఏదో ఒక సాకు చూపుతూ రైతు ఆత్మాహత్యలలో 80 శాతం కేసులను తిరస్కరిస్తున్నారు.
రైతు ఆత్మహత్యలను ఎందుకింత జటిలం చేస్తున్నారు?
వాస్తవానికి తెలంగాణ ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటకీ రాష్ట్రం లో జరిగిన అన్ని రైతు ఆత్మహత్యలకు (3432 మంది) ప్రభు త్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఉంటే ఖజానాపై పడే భారం రూ. 2 05 కోట్లు. పాలకులు స్వీయ ప్రచారాల పేరుతో చేస్తు న్న ఆ ర్భాటాలతో పోలిస్తే ఇది పెద్ద మొత్తమేమీ కాదు. కాని ఏ ప్రభు త్వ మా ప్రభుత్వంలో ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేకపోవటమే అసలు సమస్య.
రైతు ఆత్మహత్యల నివారణ మాటేమిటి
రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే ఈ రాష్ట్రం ఏర్పడిందని, ఇక రైతులు ఏ సమస్య ఉన్నా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని 2015 అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 9 ఉమ్మడి జిల్లాలకు(హైదరాబాద్ మినహాయించి) ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్లు కేటాయించింది. చాలా మంది రైతులు తమ సమస్యలు చెప్పుకోవటం ప్రారంభించారు. రెండు నెలలు గడవకముందే సరైన నియంత్రణ లేక ఆ హెల్ప్‌లైన్లు మూగబోయాయి.
కొన్ని మంచి పరిణామాలు
ఈ మధ్య కాలంలో కొంత మంది వి దేశాలలో స్థిరపడ్డ యువకులు మన దేశం వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలిసి వారి కష్ట,నష్టాలను తెలుసుకుని వా రికి అండగా ఉం టామని భరోసా ఇస్తున్నారు. మ రికొంత మంది విశ్వవిద్యాలయా ల విద్యార్థులు రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలవైపు ఆలోచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *