తెలంగాణ లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో మచ్చుకు ఒక ఉదాహరణ

తెలంగాణ లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో మచ్చుకు ఒక ఉదాహరణ, ఫేసుబుక్ లో ఉన్నటువంటి డాక్టర్స్ స్పంచగలరు.

విషయం: TSPSC ప్రకటించిన Asst Civil Surgeon నోటిఫికేషన్ No : 40 /2017 మరియు Dental Asst Surgeon నోటిఫికేషన్ No : 41 / 2017 మరియు Asst Civil Surgeon నోటిఫికేషన్ No : 44 /2017 లల్లో Physically Handicapped (PH) పోస్ట్ ల గురించి …

అయ్యా,

మీరు అనగా TSPSC ప్రకటించినటువంటి పైన తెలిపిన posts లకు visually Handicapped (VH) సంబంధించి 13 పోస్ట్ లను Asst Civil Surgeon నోటిఫికేషన్ No : 40 /2017 లో మరియు 01
పోస్ట్ ని Dental Asst Surgeon నోటిఫికేషన్ No : 41 / 2017 లో కేటాయంచడం జరిగింది. ఆ పోస్ట్ లకు మీరు మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (MCI) మరియు డెంటల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (DCI) గైడ్ లైన్స్ ప్రకారం ఉతీర్ణులై ఉండాలని మీ నోటిఫికేషన్ లో పొదుపర్చినారు.

మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (MCI) మరియు డెంటల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (DCI) గైడ్ లైన్స్ ప్రకారం అసలు visually Handicapped (VH) మరియు Hearing Handicapped (HH) విద్యార్థులకు అడ్మిషన్ ఏ ఇవ్వరు , అసలు ఆ అడ్మిషన్ కి వారు eligible ఏ కాదు . అలాంటిది మీ TSPSC ఏ విధం గ ఆ పోస్ట్ లను కేటాయించడం జరిగింది ?

visually Handicapped (VH) సంబంధించి 13 పోస్ట్ లను Asst Civil Surgeon నోటిఫికేషన్ No : 40 /2017 లో ANEASTHESIA , ENT , GENERAL SURGERY , GYNAECOLOGY , PATHOLOGY , PAEDIATRICS వంటి posts మీరు కేటాయిస్తే అసలు దేశం లో నే కాదు ప్రపంచం లో నే MBBS కె eligible కానటువంటి visually Handicapped (VH) కి సంబంధించిన వారిని మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఉద్యోగం ఇద్దామనుకున్నారు సర్ ? ఇది మిగతా Orthopedically Handicapped వారికీ అన్యాయం జరిగినట్టు కాదా ?

అసలు నిజం గ visually Handicapped (VH) డాక్టర్ తో మీరు లేదా మీ కుటుంభం సభ్యులు కానీ మీ TSPSC సిబంది కానీ ANEASTHESIA , ENT , GENERAL SURGERY , GYNAECOLOGY , PATHOLOGY , PAEDIATRICS వంటి treatment చేస్కుంటారా?

visually Handicapped (VH) సంబంధించి 01 పోస్ట్ లను Dental Asst Surgeon నోటిఫికేషన్ No : 41 / 2017 లో మీరు కేటాయిస్తే అసలు BDS కె eligible కానటువంటి visually Handicapped (VH) కి సంబంధించిన వారిని మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఉద్యోగం ఇద్దామనుకున్నారు సర్ ?

నోటిఫికేషన్ No : 44 / 2017 లో మీరు Orthopedically Handicapped కి restrict చేసినం అని మీ నోటిఫికేషన్ లో పొందుపర్చినారు కానీ అసలు ఒక్క Handicapped కి సంబంధించిన పోస్ట్ ని కూడా ప్రకటించలేదు ఎందుకని ??? మీకు జి.ఓ 16 Dt 06.06.2000 మీద సరైన అవగాహన ఉందా సర్ ? అసలు 3 % రిజర్వేషన్ ని Handicapped కి కేటాయించారా?? కేటాయిస్తే అసలు ఒక్క పోస్ట్ కూడా ఎందుకు ప్రచురితమవలేదు?

మీరు చేస్తున్న తప్పులని సరిదిద్దుకోవడానికి మాత్రమే ఈ లేఖ దయచేసి తప్పుగా భావించవొద్దు , పై పేర్కొన్న ప్రశ్నలకు సమాధానాలు మీరు తెలుసుకొని మాకు తెలపగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *