Site icon Polytricks.in

అదుపుతప్పిన శాంతిభద్రతలు -తెలంగాణ సర్కార్ ఏం పీకుతున్నట్లు..?

హైదరాబాద్ లో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యులకే కాదు ఉన్నాతాధికారులకు కూడా భద్రత లేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఓ డిప్యూటీ తహశీల్దార్ చొరబడటం సంచలనంగా మారింది. తనకు రాత్రి ఓ భయానక ఘటన ఎదురైందని.. ఓ అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని.. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు కాల్ చేయాలని.. ఇంటి తలుపులు కరెక్ట్ గా లాక్ చేశారో లేదో చెక్ చేసుకోవాలని ఆమె పెర్కొనడటం చూస్తుంటే… హైదరాబాద్ లో భద్రత ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

అనంద్ కుమార్ రెడ్డి అనే డిప్యూటీ తహశీల్దార్ ఆదివారం రాత్రి ఆమె ఇంట్లొకి చొరబడ్డారు. తలుపులు తీసుకుని నేరుగా లోపలికి వెళ్లిపోయారు. స్మితాసభర్వాల్ ఆ వ్యక్తిని గమనించి గట్టిగా అరవడంతో సిబ్బంది వచ్చి అతన్ని తీసుకెళ్ళారు. డ్యూటీ విషయమై మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆనంద్ కుమార్ రెడ్డి చెప్తున్నా.. అర్దరాత్రి వెళ్లడం వెనక ఎదో దురుద్దేశం ఉండి ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అంశంపై పోలీసులు గుంభనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

జూబ్లిహిల్స్ లోని ఐఏఎస్, ఐపీఎస్ హెడ్ క్వార్టర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలోని ఆమె ఇంట్లోకి అర్దరాత్రి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఆమె భర్త కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి. చుట్టూ కాపలాగా సెక్యూరిటీ ఉంటుంది. పూర్తిగా నిఘా నీడలో వీరి నివాసాలు ఉంటాయి. అలాంటిది వారి నుంచి తప్పించుకొని అర్దరాత్రి ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారిణి నివాసంలోకి ప్రవేశించడంతో హైదరాబాద్ లో సామాన్యులకే కాదు ఉన్నాతాదికారులకు కూడా భద్రత లేదని ఈ సంఘటన రూడీ చేస్తోంది. ఆమె చేసిన ట్వీట్ ను పరిశీలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమైందనే అర్థం వచ్చేలా ఉంది.

తెలంగాణలో చిన్నచీమ చిటుకుమన్న వెంటనే పసిగట్టేస్తామని హైదరాబాద్ లో గత ఏడాది కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అయినప్పటికీ దానితో ఎలాంటి ప్రయోజనం లేదని తేలిపోయింది. అత్యంత భద్రత నీడలో ఉండే ఐఏఎస్ అధికారుల ఏరియాలోకి ఓ వ్యక్తి రాత్రి చొరబడటంతో సహజంగానే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఆ ఏరియాలో ఉండే సీసీ కెమెరాలను ఎవరూ పర్యవేక్షిస్తున్నట్లు..? కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఏం చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయ్. కమాండ్ కంట్రోల్ నిర్మాణం షో కోసమే నిర్మించారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు సర్కార్ స్పందించలేదు.

ఇదే అంశంపై టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్, మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితమిదని పేర్కొన్నారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు…ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం. ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త! అని ట్వీట్ చేశారు. నిజంగానే..తెలంగాణలో శాంతి భద్రతలు నిర్వీర్యం అవుతున్నాయి.

ఒకే రోజులో హైదరాబాద్ లోనే మహిళా అధికారిణి ఇంట్లోకి రహస్యంగా వ్యక్తి చొరబడటం.. అదే విధంగా పట్టపగలే జియాగూడలో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేస్తోన్న ఘటనలు తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసపెట్టి హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సర్కార్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించాల్సిన హోంశాఖ మంత్రి ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చే వరకు సైలెంట్ మోడ్ లోనే ఉంటున్నారు. మహమూద్ అలీ ఉత్సవ విగ్రహంగానే ఉంటున్నారు తప్పితే.. ఆ శాఖపై ఆయనకు పట్టు లేనట్లు తెలుస్తోంది.

Exit mobile version