Site icon Polytricks.in

రేవంత్ రెడ్డిని చంపడానికి ప్రభుత్వం కుట్ర?

ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంవల్లా రేవంత్ రెడ్డిని చంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అని బయటపడింది అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డికి ఏమి జరలేదని బిఆర్ఎస్ నాయకులు తెగ బాధ పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

కొంచం లోతుగా వెళ్ళితే కాంగ్రెస్ నిందలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ పాద యాత్రకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది కాబట్టి. ముందుగా ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకూడదు అనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అన్నివర్గాలనుంచి వత్తిడులు రావడంతో సవాలక్ష కండిషన్లు పెట్టి అనుమతి ఇచ్చింది.

ఓ జాతీయ పార్టీ పబ్లిక్ మిట్టింగ్ పెట్టితే పోలీసులతో తగిన భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. మీటింగు వచ్చే జనానికి కూడా రక్షణ కల్పించాలి. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఆపేందుకు తగిన స్టాయిలో పోలీసులను మొహరించాలి.

కానీ ఈ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదు. పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తుంటే ఎన్ని లక్షల మంది జనం వస్తారో పోలీసు ఉన్నత అధికారులకు తెలుసు. అయినా ఓ సర్పంచ్ మీటింగు కల్పించే భద్రత కూడా రేవంత్ పాద యాత్రకు కల్పించడం లేదు. లక్షలాది జనం లో పోలీసుల జాడలేదు. ఇంటలిజన్స్ జాడ కూడా లేదు. ‘నామ్ కే వాస్తే’ నలుగురు పోలీసులు, ఓ సబ్ ఇనస్పెక్టర్ ఎక్కడో మారుమూల కూర్చుని బాతాకాని కొడుతున్నారు.

రోడ్డు మీద కనీసం బ్యారికేడ్లు కూడా పెట్టకుండా ట్రాఫిక్ నిలిచిపోయేలా చేస్తూ పాద యాత్రకు కావాలని ఆటంకాలు కల్పిస్తున్నారు. ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీనికి తోడూ అధినాయకుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల బిఆర్ఎస్ కార్యకర్తలు తాగొచ్చి రేవంత్ రెడ్డి మీద రాళ్ళు, కోడి గుడ్లు విసిరి తమ అక్కసుని తీర్చుకుంటున్నారు. మొన్న భూపాలపల్లి లో జరిగిన రాళ్ల దాడి సంఘటన దీనికి నిదర్శనం. ఈ రోజు రాళ్లు విసిరినవాళ్లు  రేపు బాంబులు విసరరని గ్యారంటి ఏమిటి?

చూస్తూ ఉంటే ఇదంతా కుట్ర పురితనగా తెలంగాణ ప్రభుత్వం చేయిస్తోంది అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ ఒక్కటే. రేవంత్ రెడ్డి పాద యాత్ర విజయవంతగా ముగించి ప్రజల కళ్ళు తెరిపించారాదు. వీలుంటే దాడులు చేసి భయపెట్టాలి.

Exit mobile version