Site icon Polytricks.in

ఆంజనేయుడి విగ్రం ముందు అమ్మాయిల అర్థనగ్న ప్రదర్శన?

ఆజన్మ బ్రమ్మచారాగా పేరుపొయిందిన ఆంజనేయుడి విగ్రం ముందు అమ్మయిలు బికినిలతో అర్థనగ్న  ప్రదర్శన  ఇస్తే హిందూ మతస్తులు ఊరుకుంటారా? ఆంజనేయుడి దర్శనం కోసం వచ్చిన మగ భక్తులు బికినిలలోని ఆ అమ్మయిల అందాలూ చూసి చొంగ కారుస్తూ, కళ్ళు అప్పగించి చూస్తారా? లేక నిగ్రహంతో బుద్దిగా కళ్ళు ముసుకుంటారా? వాళ్ళ నిగ్రహికి ఇది కఠిన పరీక్షనే. కొందరు బ్రమ్మచారులు దొంగ చూపులు చూడక తప్పని పరిస్టింది నెలకొంది. అది ఎక్కడో విదేశాలల్లో కాదు. ఆంజనేయుడి నిత్యం పూజించే మన దేశంలో, అందులోను బిజెపి కనుసన్నల్లో మససిలే మధ్యప్రదేశ్లో.

అవును, అంతర్జాతీయ మహిళా దినోస్తావం సందర్బంగా మధ్యప్రదేశ్ లో నిర్వహిస్తున్న ‘ఉమెన్ నేషనల్ బాడీ బిల్డింగ్ షో’లో హనుమంతుడి విగ్రహం ముందు కండలు తిరిగిన మన మహిళామణులు బికినీలో తమ సిక్స్ ప్యాక్ (సెక్సీ ప్యాక్ కాదు) ప్రదర్శించారు. అందరి ముందు కసరత్తులు చేశారు.

అమ్మాయిలు వ్యాయామశాలలో సిక్స్ ప్యాక్ గా పెంచిన తమ బాడీ బిల్డింగ్ అందాలను బికినిలల్లో ప్రదర్శించారు. బలానికి, శక్తికి, సిక్స్ ప్యాక్కి ఆంజనేయుడికే అగ్ర తాంబూలం ఇస్తారు. వ్యాయామశాలలో ఆంజనేయుడి విగ్రం పెట్టి నిగ్రహంతో మగవాళ్ళు గంటల తరబడి వ్యాయామం చేయడం తరతరాలుగా వస్తున్న మన  ఆచారం. కుస్తీ పోటిలకు పెట్టింది పేరు.  ఆ కుస్గెతీ పోటిలలో గెలిచిన వాళ్ళకు ఓ గాధ ను ఇవ్వడం కూడా ఓ ఆచారం.

అయితే ఇంతకాలం అది మగవాళ్ళకు మాత్రమే పరిమితం అయ్యింది. మేము కూడా మగవాళ్ళకు ఏమి తక్కువ కాదు అని అన్ని రంగాలలో దూసుకు వసున్న మహిళలు ఇప్పడు ఇందులో కూడా దూరారు. ఇది విదేశాలల్లో జిమ్ లల్లో కొన్నేళ్లుగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సంస్కృతీ మన దేశంలోకి దిగుమతి అయ్యింది. జిమ్ లో ఇలాంటి షో లు చేస్తే పర్వాలేదు. కానీ ఏకంగా ఆంజనేయుడి విగ్రం ముందు అర్థ నగ్నంగా కండలు చూపడమే ఇప్పుడు వివాదంగా మారింది. హిందూ మహిళలు ఇలా చేయడంపై విమర్శలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.

దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ లో షేర్ చేయడం పుండు మీద కారం చల్లినట్లు వైరల్ గా మారింది. మహిళలు హనుమాన్ విగ్రహం ముందు బాడీ బిల్డింగ్ చేయడం తప్పు కాదని ఆయన వాదిస్తున్నారు. దేవుడు ఆడవాళ్లకు, మగవాళ్ళకు సమానం అని వాదిస్తునారు. ఇందులో సెక్స్ కి తావు లేదు సిక్స్ ప్యాక్ మాత్రమే చూడండి  అంటున్నారు. మగాడు తన కండలు చూపితే లేని తప్పు ఆడవాళ్ళు చూపితే ఏమిటని నిలదీస్తున్నారు.

ఆంజనేయుడి విగ్రం ముందు బికినీ ప్రదర్శన ఏమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఆ ప్రదర్శన చేయడానికి హనుమాన్ విగ్రహమే దొరికిందా? అని అడుగుతున్నారు. ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అని నిలదీస్తున్నారు. మహిళలు ఆంజనేయుడి విగ్రహం ముందు ఇలాంటి పనులు చేయడం పాపం అని బిజెపి నేతలు మండిపడుతున్నారు.

విడుదల చేసిన ఈ వీడియోలు వెంటనే బ్యాన్ చేయాలనీ కామెంట్లు చేస్తున్నారు. దేవుడు అందరికి సమానం కావచ్చు. కానీ ఆంజనేయుడి విషయంలో ఇది వర్తించదు అన్నది బిజెపి నేతల వాదన.

ఈ వివాదంలో అఖిలేష్ యాదవ్ చొరవ తీసుకోవడంలో ఆంతర్యమేమిటో ఎవ్వరికీ తెలియడం లేదు. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. కానీ దీనిని కూడా రాజకీయం చేయాలనీ చూస్తున్నారు. ఇది చిలికి చిలికి గాలివానలా మరెలా ఉంది.

Exit mobile version