Site icon Polytricks.in

మంత్రి రోజాపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్

ఇటీవల మెగా బ్రదర్స్ పై ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను తాజాగా ఖండించారు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. ఆమె ఇలా నిరాదర ఆరోపణలు చేస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ఉనికి కోసం మెగా బ్రదర్స్ పై నిందలు మోపడం సరైంది కాదంటూ రోజాకు గెటప్ శ్రీను హితవు పలికారు.

అసలు విషయం ఏంటంటే…మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ మంత్రి రోజా ఇటీవల దారుణమైన కామెంట్స్ చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదు. కనీసం సొంత జిల్లా ప్రజలకు కూడా ఏమి చేయలేదు. అందుకే ముగ్గురు అన్నదమ్ములను ఏపీ ప్రజలు ఓడించారు. ఎన్టీఆర్ , ఎంజీఆర్, జయలలిత తమకు జీవితం ఇచ్చిన ప్రజలకు మేలు చేశారు. మెగా బ్రదర్స్ ను నెత్తినమోసిన తెలుగు ప్రజలకు వారు ఏం చేయలేదని రోజా మండిపడ్డారు.

రోజా వ్యాఖ్యలపై నాగబాబు ఎదురుదాడి చేశారు. రోజా నోరు మున్సిపాలిటీ చెత్త కుప్పతో సమానం. అందుకే ఆమె ఎన్ని ఆరోపణలు చేసిన పట్టించుకోవద్దు అనుకున్నా. కాని తప్పడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఆమె నిర్వర్తిస్తోన్న శాఖ అట్టడుగు స్థాయికి దిగజారింది. టూరిజం శాఖపై ఆధారపడిన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించకుండా అనవసర విషయాలపై రోజా మాట్లాడుతుంది అంటూ మండిపడ్డారు నాగబాబు.

రోజా వ్యాఖ్యలను చిరంజీవి అభిమాని గెటప్ శ్రీను సైతం ఖండించారు. రోజా మెగా బ్రదర్స్ ను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పోస్ట్ ను  సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో… చిరంజీవిగారి దాన గుణం, సేవా గుణం తెరిచిన పుస్తకం. సేవ కార్యక్రమాల్లో ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మీ ఉనికి కోసం ఇలాంటి నిరాదరణ ఆరోపణలు చేయడం సరికాదు. మీ నోటి నుండి ఇంత పచ్చి అబద్దాలు వస్తాయని ఊహించలేదు. మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండంటూ గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Exit mobile version