Site icon Polytricks.in

దేశంలో అతిపెద్ద పర్సనల్ డేటా చోరీ కేసులోకి దూరిన ఈడి? బ్యాంకులకు, బడా కంపనిలకు నోటిసులు?

తెలంగాణలో మొదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పర్సనల్ డేటా చోరీ’ కేసును ఈడి సుమోటోగా తీసుకుంది. అందుకే నిన్న అధికారికంగా ప్రకటించింది. కేసు దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందిలో భాగంగా ఎవ్వరు ఊహించని పేర్లు వెలుగులోకి వచ్చాయి.

పేరు మోసిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, టెక్ మహీంద్రా, బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్ బుక్, పాలసీ బజార్, మ్యాట్రిక్స్ లాంటి మొత్తం 11 కంపెనీలకు నోటీసులు పంపింది పంపి సంచలనం రేపింది.

వీళ్ళతో పాటు అమెజాన్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఎనిమిది పేరు మోసిన కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ మొదలుపెట్టారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం గోప్యతపై కంపెనీలు వివరణ ఇవ్వాలని ఈడి నోటీసుల్లో ప్రధానంగా పేర్కొంది.

అయితే ప్రైవేటు సంస్టలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్టలు కూడా ఈ డేటాను బ్లాక్ లో కొనుగోలు చేయడం మింగుడు పడని విషయం. ఇది చిలికి చిలికి గాలివానలా మారి కేంద్ర ప్రభుత్వానికి చుట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసుకు మూల సూత్రధారిగా భావిస్తున్న 36 ఏళ్ల వినయ్ భరద్వాజ్ ను ఏప్రిల్ 1వ తేదీన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నోయిడా ముంబైలోని మూడు గ్యాంగులకు చెందిన 15 మందిని ఇదివరకే అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇచ్చిన సమాచారంతోనే హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న డేటా సెంటర్ పై సిట్ అధికారులు దాడులు చేసినట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు.

ఓ వెబ్ సైట్ ద్వారా అతడు వినయ్ భరద్వాజ్ దాదాపు 67 కోట్ల మంది భారతీయుల డేటాను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టినట్టు గుర్తించారు. ఇందులో 24 రాష్ట్రాల సంపన్నుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకుల వివరాల సమాచారం ఉన్నట్టు తేల్చారు.

దాదాపు 135 కేటగిరిటీలకు చెందిన మొత్తం 66.9 కోట్ల మంది వ్యక్తిగత డేటాబేస్ ను స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇందులో హైదరాబాద్ కు చెందిన వాళ్ళ 56 లక్షల మంది పర్సనల్ డేటా ఉన్నట్లు తెలిసింది. దీనితో పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్ కు  చెందిన కోట్లదిమంది పర్సనల్ డేటా కూడా ఉన్నట్టు గుర్తించారు.

భరద్వాజ్ మీద పలు కేసులు నమోదు చేసిన పోలీసులు కొత్త విషయాలు రాబడుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన అన్ని కేసుల మీద విచారణ జరుపుతున్నారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరగే అవకాశం ఉంది.

Exit mobile version