Site icon Polytricks.in

అంతా తూచ్ – కవిత అరెస్ట్ ఉత్తదే..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అంటూ హడావిడి చేసింది బీజేపీ బలం పెంచుకునేందుకే తప్ప నిజానికి ఆమె అరెస్ట్ ఉండబోదని స్పష్టత వస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పై సానుభూతి పెరుగుతుందని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే కవిత అరెస్ట్ పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల డైరక్షన్ లో పని చేసే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈమేరకు దూకుడు తగ్గించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్ లో హైద‌రాబాద్ లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. 91 సీఆర్పీసీ ప్ర‌కారం ఎల‌క్ట్రానిక్స్ ఎవిడెన్స్ స‌మ‌కూర్చాల‌ని ఆదేశించారు. ఎప్పుడు సమర్పిస్తారు..? ఎలా సమర్పిస్తానేది గోప్యంగా ఉంచారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేశారని..10మొబైల్ ఫోన్లు పగలగొట్టారని చార్జ్ షీట్ల‌లో సీబీఐ విచారణకు మునుపే ఈడీ పేర్కొంది. సిమ్ కార్డులు కూడా మార్చారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఆమె కీలక భాగస్వామిగా ఉన్నారని ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఇక కవితను జేజెమ్మ కూడా కాపాడలేదని ఆమె అరెస్ట్ తథ్యమని లీకులు ఇచ్చారు. కాని ఇప్పుడు వాటి చర్చే లేకుండా పోయింది.

ఆధారాలు సేకరించిన తరువాతే ఈడీ అధికారులు చార్జీ షీట్ లో కవిత పేరును ప్రస్తావించారు. అసలు ఆధారాలు లేకుండా చార్జీషీట్ లో కవిత పేరును ప్రస్తావించే అవకాశం లేదు. అన్ని ఆధారాలు పక్కాగా ఉంటేనే చార్జీషీట్ లో పేరును ప్రస్తావిస్తారు. మొదట్లో దూకుడుగా వ్యవహరించి ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు ఇటీవల దూకుడు తగ్గించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

లిక్క‌ర్ స్కాంలో రెండు చార్జ్ షీట్ల‌లో మొత్తం 13,567 పేజీలు దాఖ‌లు చేశారు. మొద‌టి దాంట్లో 28 సార్లు కవిత పేరును పేర్కొన్నా.. రెండో దాంట్లో నిందితురాలిగా చేర్చేంత బ‌ల‌మైన ఆధారాలు రాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో అడిష‌న‌ల్ చార్జ్ షీట్ లో కూడా పేరు ప్ర‌స్తావించ‌డ‌మే త‌ప్ప.. బీజేపీ నేత‌లు ఆరోపించిన‌ట్లు ఎలాంటి చ‌ర్య‌లు క‌నిపించ‌లేదు. అంటే, లిక్క‌ర్ స్కాం జ‌రిగింది అన‌డానికి ఆమె ఒక సాక్షిగానే ఉన్న‌ట్టు. ఈ కేసులో కింగ్ పిన్ కవితేనని మొదటి నుంచి ఆరోపించిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కవిత పేరును సాక్షిగా మత్రమే పరిమితం చేయడం ఇప్పుడు కొత్త సందేహాలను లేవనెత్తుతున్నాయి.

లిక్కర్ స్కామ్ తో బీజేపీ , ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీఆర్ఎస్ లు కలిసి డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. రెండు పార్టీల మధ్య పోటీ కోసం కాంగ్రెస్ ను చర్చలో లేకుండా చేసేందుకే బీజేపీ , బీఆర్ఎస్ లు కలిసి ఆడుతోన్న నాటకమని ఆరోపిస్తున్నారు. నాడు రేవంత్ ఏదైతే చెప్పాడో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనిస్తే కాంగ్రెస్ ను కిల్ చేసేందుకే ఈ రెండు పార్టీలు ఈ రెండు అంశాలను వాడుకున్నట్లు స్పష్టం అవుతుంది.

Exit mobile version