Site icon Polytricks.in

పోర్న్ స్టార్ కేసులో డొనాల్డ్ ట్రంప్..కేసు అసలు కథేంటంటే..?

అనగనగనగా ఓ రాజు ఉండే వాడు. గొప్ప మేధావి. అతనికి తెలివితేటలూ ఎంత ఎక్కువో, కామం కూడా అంతే మక్కువ. కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి తర్వాత రాజ్యం కోసం భార్య తనను చంపవచ్చని భయం. అందుకే ఇల్లీగల్ ఎఫ్ఫైర్ పెట్టుకోదలిచాడు.

కన్నె పిల్లను గోకితే  పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది. పెళ్ళయిన స్త్రీ వెంటపడితే అపఖ్యాతి వస్తుంది. కావున ఫ్యామిలీ టైపులో గుట్టుగా ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిని సెట్ చేయమని మంత్రికి చెప్పాడు. అది ఇంకా తల నొప్పి అని మంత్రి ఎంతచెప్పినా రాజు వినలేదు. ఒళ్ళు అమ్ముకునే స్త్రీ పెళ్లి చేసుకోమని బలవంతం చేయదు. కడుపోచ్చినా తీయించుకుంటుంది అని రాజు ధీమా.

కొన్ని రోజులు ఆమెతో బాగానే సుఖపడ్డాడు రాజు. ఆమె మీద మోజు తీరి మరో స్త్రీ వెంట పడ్డాడు రాజు. అంతే! రాజు వల్ల తనకు కడుపు వచ్చింది, తనను పెళ్లి చేసుకోవాలి, తనకు పుట్టబోయే కొడుకుని రాజుని చేయాలి అని అల్లరి చేసింది. దాంతో రాజ్యం పోయిన రాజు రోడ్డున పడ్డాడు.

సరిగ్గా అమెరికా మాజీ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఇదే జరిగింది. శృంగార తారగా, పోర్న్ స్టార్ గా వెలుగొందిన స్టార్మీ దేనియల్స్ తో డోనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అది అమెరికాలో మాములు విషయం. ఆమె ఎలాంటిదో అందరికి తెలుసు. అయినా ఆమెతో చాలా కాలం కులికాడు. ఆమె ప్రతి రాత్రికి ఓ రేట్ ఫిక్స్ చేసింది. ఇలా ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఏళ్ల తరబడి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు యూరప్ లో ఎందరో. ఇది అక్కడ ఓ వ్యాపారం.

దీనిని గుట్టుచప్పుడు కాకుండా నడపడం కూడా ఆ వ్యాపారంలో భాగమే. ఇది అందరికి తెలిసిన విషయమే. దానికి కూడా అదనంగా డబ్బు ఇస్తారు. మునుముందు తమకు ఇబ్బందులు రాకుండా కేవలం డబ్బు రూపేణా వ్యవహారం నడుపుతారు. చెక్కు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వోచర్ లాంటివి వాడరు.

కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ట్రంప్ అతితెలివికి పోయి, నగదుకు బదులు తన వ్యాపార కంపెనీల ద్వారా ఆమెకు ఇవ్వవలసిన డబ్బును బ్యాంకులో వేయించాడు. అక్కడ దొరికాడు గురుడు. ఆమె దానిని చాలా తెలివిగా వాడుకుంది. అతని మోజు తీరనన్ని రోజులు డబ్బులు దండిగా దండుకుంది. ఆ తర్వాత ఆమెను వదలి,  మరో అమ్మాయి వెంట పడుతుంటే ఆదాయం తగ్గిపోయింది.

2016 నుంచి ఆమె ట్రంప్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు దండుకుంది స్టార్మీ దేనియల్స్. అతను కొంతకాలానికి ఎదురు తిరిగాడు. ఆమెకు కావలసింది కూడా అదే. దానిని తెలివిగా వాడుకుంటూ కోర్టులో కేసు వేసి ట్రంప్ ని  చట్టం చంకలో అడ్డంగా ఇరికించింది. అతని సంపదలో తనకు కొంత వాటా కావాలని దావా వేసింది. రాజకీయంలో ట్రాంప్ కు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, తన ‘వృత్తి’లో  కూడా స్టార్మీ దేనియల్స్ అన్ని తెలివితేటలూ ఉన్నాయి. ఒళ్లమ్ముకునే ఆడది పరువుగా ఎలా బతుకుతుంది? ఇతరులను పరువుగా ఎందుకు బతకనిస్తుంది? ఇంత చిన్న లాజిక్ ని ట్రంప్ ఎలా మరిచాడు?

ఆమె తీసుకున్న డబ్బుల వివరాలు, వ్యపారాల పేరిట చేసిన ఖర్చులు పోలీసులకు సరిపోయాయి. ఇది క్రిమినల్ కేస్ గా నమోదు అయ్యింది. కేసు అతని మెడకు పాములా చుట్టుకుంది. ఓ అమెరికా ప్రెసిడెంట్ ఇలా క్రిమినల్ కేసులో ఇరుక్కుని, కోర్ట్ మెట్లు ఎక్కడం ఇదే తొలిసారి. ఈరోజు ట్రంప్ న్యూయార్క్ కోర్టులో హాజరు కాబోత్తున్నాడు. గొప్ప వ్యాపారిగా, సంచలన ప్రసిడెంట్ గా నిర్మించుకున్న అద్దాల మెడ నేడు భళ్ళున పగలబోతోంది.

కావాలని బురదలోకి దూక నెలా? బురద అంటింది అని అరవనేలా? ఇలాంటి అవినీతి కథలు నేటి యువతకు నీతి కథలుగా మారాలి.

Exit mobile version