Site icon Polytricks.in

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఎందుకు అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందో తెలుసా?

మార్చ్ 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023’ విజయవంతంగా ముగిసింది, జీఐఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి, 15 రంగాలు ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి అని సిఎం జగన్ ఉత్సాహంగా ప్రకటించారు. కానీ ఇది పైకి చేస్తున్న ఆర్భాటమే. కానీ నిజానికి ఇది విజయవతం కాలేదని పారిశ్రామిక వేత్తలు పెదవి విరిచారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

జగన్ సింగిల్ విండో విధానంలో, ఒక్క ఫోన్ కాల్ అనుమతులు ఇచ్చే విధానం బాగుంది అని వాళ్లు చెప్పారు. ఇతర సదుపాయాలు కూడా ఆశా జనకంగానే ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన అంశం మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఏది మొదలు పెట్టాలన్న ‘రెడ్డి వచ్చే – మొదలు పెట్టే’ చందనంగా మారింది.

ఎందుకంటే 

జగన్ అన్నిటికి అనుమతులు ఇస్తామని ముందుకు వస్తున్నారు. కానీ అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా ఎంత పెడుతుందో స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అసలే అప్పులతో పూడుకుపోయింది. మేము కూడా ఎంతోకొంత పెట్టుబడులు పెడతాము అని ధైర్యంగా ముందుకు రాలేక పోతోంది.

ఎంతసేపు మీకు అనుమతులు ఇస్తామని చెప్పిందే కానీ, మీరు ఇంత పెట్టుబడులు పెడితే, మేము కూడా ఇంత పెట్టుబడి పెడతాము అని గట్టిగా చెప్పి వ్యాపారులను ఒప్పించాలేకపోయినట్లు తెలిసింది. అంటే మీరే ఆకులూ తెచ్చుకోండి, మీరే విస్తరి కుట్టుకోండి, మీరే అన్నం వండుకోంది, మీరే వార్చు కొండి, మేము రుచి చూసి బాగా వండారో లేదో మేము చెపుతాము అనే చెందనంగా మారింది పరిస్టితి.

అంటే మీకు భూములు చూపిస్తాము – వాటిని మీరే కొనుక్కోవాలి, మీకు విద్యుత్ సరఫరా చేయిస్తాము – వాటి థర్మల్ స్టేషన్ లు మీరే నిర్మించుకోవాలి. మీకు నీటి సరఫరా చేయిస్తాము – వాటి కాలువలు (లేదా పైపులు) మీరే కట్టుకోవాలి అన్ని మౌలిక సదుపాయాల ఖర్చులు కూడా వాళ్ళ మీదే మోపేందుకు చూశారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మౌళిక సదుపాయాల ఖర్చుల డబ్బు లేదు కాబట్టి.

ఈ నిబందనలను వాతావరణం కాలుష్యం చేసే కేమికాల్ ఫ్యాక్టరీలు  (యురేనియం శుద్ధి కర్మాగారాలు, అణుధార్మిక ఉత్పాదక ఫ్యాక్టరీల లాంటివి) ఒప్పుకోవచ్చు. కానీ వాటికి కేంద్రం అనుమతులు ఇవ్వదు. అలాంటి కంపెనీలకు ఏ దేశంలో  కూడా అనుమతులు ఇవ్వడం లేదు. ఒకవేళ జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పని జరగదు. ఆ ఫ్యాక్టరీ పని మొదలు పెట్టగానే అటు ప్రతిపక్షాలు, ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒప్పుకోరు. ఆందోళనలు చేస్తారు. ఇవన్నీ అబార్షన్ కేసులే.

చరిత పునరావృతం?

సరిగ్గా ఇదే సమస్య ఇంతకు ముందే జగన్ కు ఎదురయ్యింది. లోగడ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సమిట్జ లల్గలో  జగన్  పాల్గొని ఇలాంటి ఆఫర్ లు చూపి ఎదురు దెబ్బలు తిన్నారు. ‘మేము ఏపిలో ఫ్యాక్టరీలు కడతాము’ అని అందరు ఉరించారు. కానీ ఏపి కి వచ్చి ఫ్యాక్టరీలు తెరువలేదు. పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. ఈ విషయంలో కెటిఆర్ గొప్ప విజయం సాదించారు. ఆయన మౌలిక సదుపాయాలు కల్పించారు. కాబట్టి తెలంగాణకు ఎన్నో భారీ ప్రరిశ్రమాలు తరలివచ్చాయి. ఆయన ఏనాడు ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయలేదు.

ఎవరెవరు వచ్చారు? 

నిజానికి మార్చ్ 3, 4 తేదీల్లో విశాఖపట్నం సమిట్లో పాల్గొనవాళ్ళలో 10 శాతం (నాలుగైదు) పెద్ద కంపెనీలు ఉన్నాయి. మిగతా పెద్దలు రాలేదు. వాళ్లు ఎలాంటి ఖర్చు నైనా భరిస్తారు. కానీ వచ్చిన వాళ్ళల్లో మిగతా 90 శాతం చిన్నతరహా పరిశ్రమల వాళ్ళే. ప్రభుత్వం పిండి ఇస్తేకానీ రొట్టె చేయలేరు. ఒప్పందాలు కుదిరినంత మాత్రానా వాళ్ళు ఫ్యాక్టరీలు కడతారు అనే నమ్మకం లేదు.

రాజకీయ సక్షోభం? 

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు –  ఈ సారి ఎన్నికలల్లో జగన్ గెలువకపోతే, మరో పార్టీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఇచ్చిన అనుమతులు కక్షసాదింపు చర్యలలో భాగంగా రద్దు చేస్తారు అనే భయం లేకపోలేదు. పైగా ఇంకా ఏపి కి రాజధాని లేకపోవడం ఏమిటనే సందేహాలు వాళ్ళను వెంటాడుతున్నాయి.

సరైన రోడ్లు, ఫైవ్ స్టార్ హోటల్లు, ట్రాన్స్ పోర్ట్ విధానం సరిగ్గా లేకప్వడం లాంటి అంశాలు వాళ్ళను ఇబ్బందిపెడుతున్నాయి. చూడాలి! ఏం జరగనుందో.

Exit mobile version