Site icon Polytricks.in

రిలయన్స్ అధినేత అంబానీని నారా లోకేష్ ఎందుకు తిట్టాడో తెలుసా?

రిలయన్స్ అధినేత అంబానీని విమర్శించే అర్హత టీడీపీ నేత నారా లోకేష్‌కి లేదని ఎంపి మార్గాని భారత్ తీవ్ర స్టాయిలో విరుచుకుపడ్డాడు. మొన్న  విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో పాలుగొన్న వాళ్ళందరూ లోకల్ పారిశ్రామిక వేత్తలేంని నారా లోకేష్ అన్నారు. రిలయన్స్ అధినేత అంబానీ కూడా లోకల్ వ్యాపారి అని ఎద్దేవ చేశారు.

ఈ సమిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎక్కడ జరిగాయో జగన్ చూపాలని లోకేష్ నిలదీసారు. జగన్ లీడర్ షిప్‌పై నమ్మకంతో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టరని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం జగన్ చెపితే ఎవ్వరు నమ్ముతారని అన్నరు. అసలు అది విజయవంతం కానీ సమ్మిట్ అని చెప్పారు.

దీనికి ఎంపి మార్గాని భారత్ విరుచుకుపడి నారా లోకేష్ ని దుయ్యబట్టారు. విజయవంతం అయ్యిన ఆ సమిట్ ని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఒక మీడియా బురద జల్లుతోందని మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి సొంతంగా ఓ పార్టీని స్తాపించి ప్రజల మనసు గెలుచుకుని, సిఎం గా ఎదిగిన ప్రజల నాయకుడు అని గర్వంగా అన్నారు. లోకేష్ ఇంకా ఎంఎల్ఏ గా కూడా గెలవలేదు అన్నారు. తన తాత పెట్టిన తెలుగు దేశంపార్టీ వల్ల లోకేష్ బతుకుతున్నాడు అన్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడి అండదండలతో బతుకుతున్న ఒక బచ్చా అని వ్యాఖ్యలు చేశారు. ఆ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే లోకేష్ ఎందుకు పనికిరాని మొద్దు అని ఎద్దేవ చేసారు. జగన్ ని విమర్శించే అర్హత ఇంకా లోకేష్ కి రాలేదని ఎదురు దాడి చేశారు.

లోకేష్ ముఖ్యమంత్రితో పోల్చుకోవడం నక్కుకు, నాగలోకాని ఉన్న తేడా అన్నారు. లోకేష్ మూడు శాఖలకు మంత్రిగా చేశానని డబ్బా కొట్టుకుంటున్నాడు, కానీ అతను ఇప్పటివరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి చెంపపెట్టు సమాధానం ఇస్తామని ఎంపీ మార్గాని భరత్ తీవ్ర హెచ్చరించారు.

మాట్లాడే ముందు ఏపీ గ్రోత్ రేటు 11.4 శాతం ఉందని తెలుసుకోవాలి అని హితవు పలికారు. ప్రతిపనికి ఇలా తప్పు పడితే ప్రజలే తగిన గుణపాటం నేర్పుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, టీడీపీ హయాంలో కాంట్రాక్ట్‌కు కక్కుర్తిపడి తాము చేస్తామని చంద్రబాబు అన్నారని తెలిపారు. కమిషన్ కొట్టేయాలనే కక్కుర్తితో ప్రాజెక్ట్ మొదలు పెట్టారని ఎంపీ మార్గాని భరత్ తీవ్ర పద జాలంతో విమర్శలు గుప్పించారు.

Exit mobile version