Site icon Polytricks.in

యావత్తు ఇండియానే ఖంగు తినిపిస్తున్న ఓ సామాన్యుడి మేధస్సు ఏమిటో తెలుసా?

అతను నోబెల్ అందుకున్న ఆర్తికవేత్త కాదు. ఎంఎస్సి మాథ్స్ చదవలేదు. ఓ కూలి. ఓ చాయ్ వాలా ప్రధాని అయ్యినట్లు, ఓ ఆటో డ్రైవర్ సిఎం అయినట్లు, ఇప్పుడు ఓ కూలి దేశాన్ని ఆలోచింప చేస్తున్న ఓ న్యూటన్, ఓ ఆయిన్ స్టయిన్. అతను ఎవరో కాదు, తెలంగాణాలోని జనగాం కు చెందిన కూలి. అతను వాట్స్ ఆప్లో పెట్టిన ఓ మెసేజ్ దేశం మొత్తం వైరల్ గా మారింది. వచ్చే ‘మన్ కీ బాత్ లో’ మోడి దీని మీద  ప్రసంగించబోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ మీద రూ. 50 పెంచిన విషయం తెలిసిందే. బిఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాలు దానిని రాజకీయం చేస్తూ ఆందోనలలు చేస్తున్నాయి. కానీ ఆ సామాన్యుడు మాత్రం దానికి పాజిటివ్ గా స్పందించి, అందులో తప్పు లేదని సమర్ధించాడు.

ఎందుకంటే ఒక్క సిలెండర్ అతనికి మూడు నెలలు వస్తుంది. పెంచిన రూ. 50 లను మూడు నెలల కింద భాగారం చేస్తే నెలకు కేవలం రూ. 17 భారం పడుతోంది. అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయి లోపే. కాబట్టి పేదవాడికి భరించరాని భారం మాత్రం కాదు.

అసలు సిసలు భారాలు చాలా ఉన్నయి అని వివరించాడు. రోజు అతను కూలి కోసం బస్ లో 20 కిలో మీటర్లు  వెళ్ళతాడు. ఇంతకుముందు బస్సు టికెట్ రూ. 15 రూపాయలు ఉండేది. కానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక అది రూ. ౩౦ మారింది. అంటే అతను రోజు రూ. 15 రూపాయలు నష్ట పోతున్నాడు. అంటే నెలకు రూ. 450 చెల్లించే వాడు ఇప్పుడు రూ. 900 చేల్లిస్తున్నాడు. పేదవాడికి భారం అంటే ఇది.

అతని కూతురు స్టూడెంట్ బస్సు పాస్ లోగడ రూ. 200 ఉండేది. కెసిఆర్ వల్ల అది రూ. 800 అయ్యింది. పేదవాడికి భారం అంటే ఇది.

అతని ఇంటికి కరెంట్ బిల్ లోగడ రూ. 120 ఉండేది. కెసిఆర్ వల్ల అది రూ. ౩00 అయ్యింది. పేదవాడికి భారం అంటే ఇది.

మోడి పెంచిన గ్యాస్ ధర వల్ల ప్రతి ౩ నెలలకు కేవలం రూ. 50 భారం పడుతోంది. కానీ కెసిఆర్ వల్ల ప్రతి ౩ నెలలకు రూ. 4000 రూపాయల భారం పడుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వమే మేలని మురిసిపోతున్నారు.

ఇదండీ ఓ పేదవాడి ఫిలాసఫి. ఎవ్వరికీ రాని ఈ గొప్ప ఆలోచన అతనికి వచ్చింది. కానీ కుటిల రాజకీయాలు చేసే మన నాయకులు ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది.

Exit mobile version