Site icon Polytricks.in

పూనం కౌర్ వెక్కి వెక్కి ఏడవడానికి కారణం తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోస్తావం సందర్బంగా రాజ్ భవన్ లో జరిగిన ఓ సభలో నటి పూనం కౌర్ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమె గుండెలో ఎప్పటినుంచో దాగున్న కసిని, కోపాన్ని మొదటిసారి బయటపెట్టారు. దానికి కారణం ఆమెను పంజాబీ అమ్మాయి అనుకుని తెలుగు పరిశ్రమ తనకు హీరోయింగ్ గా అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

కావాలని తెలుగు పరిశ్రమ తనను దూరంగా ఉంచుతోంది అన్నారు. కావాలనే తనను పాతాళానికి నొక్కేస్తున్నారు అని ఆవేదన వెళ్లగక్కారు. తాను పంజాబీ అమ్మయి అయ్యినప్పటికీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను అని, తాను తెలుగింటి ఆడపుచునని ఆవేదన చెందారు. ఇలాంటి పక్షపాత దోరణి తెలుగు పరిశ్రమకు ఉండడం దౌర్భాగ్యం అని బాదపడ్డారు. తాను గొప్ప స్టాయికి ఎదగకపోవడానికి కారణం ఇక్కడి కుటిల రాజకీయాలే కారణం అన్నారు. తన అందానికి, టాలెంట్ కు ఏం తక్కువ అని నిలదీశారు.

పూనం కౌర్ చెప్పింది ఏ మాత్రం వాసవనం కాదు. ఒకప్పుడు వహీదా రెహమాన్ , జయప్రద, శ్రీదేవి లాంటి తెలుగు హీరోయిన్లు హిందీ పరిశ్రమను ఏలారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మొత్తం మారింది. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు తెలుగు అమ్మయిలను చిన్న చూపు చూస్తోంది. హిందీ, పంజాబీ, మలయాళం, కన్నడ హిరోయిన్లకే పెద్ద పీట వేస్తోంది.

ఇప్పుడున్న పది మంది అగ్ర హీరోయిన్లలో ఒక్క తెలుగు అమ్ముయి కూడా లేదు. పొతే రాకుల్ ప్రీత్ సింగ్, రాషి కన్నా లాంటి పంజాబీ అమ్మయిలు ఎందరో గొప్ప పొజిషన్లో ఉన్నారు. వాళ్ళను పరిశ్రమ ఎందుకు తోక్కేయడం లేదు? ఎందుకంటే మాకు  పరయివాళ్ళే కావాలని తెలుగు పారిశ్రామ ముంబై చుట్టూ హీరోయిన్ల కోసం తిరుగుతోంది? ఆమె ఆవేదనను తెలుగు అమ్మయి చెపితే అతికేలా ఉండేది. అయినా మన ముఖానికి మసి పూసుకుని అద్దాన్ని నిందిస్తే ఎలా?

Exit mobile version