Site icon Polytricks.in

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ – హైకోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై అనర్హత వేటు విషయం మరవకముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు వేసింది హైకోర్టు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు తేలడంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తరువాత స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి స్థానంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. అయితే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ సెక్రటరీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యేకు సంబంధించిన అంశంలో అసెంబ్లీ సెక్రటరీ ఎలా వ్యవహరిస్తారు..? అనేది ఆసక్తికరంగా మారింది.

దాదాపు 27మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఎన్నికలకు మరో మూడు నెలల కాలపరిమితి మాత్రమే ఉన్న సమయంలో హైకోర్టు ఒక్కొక్కటిగా తీర్పులు ఇస్తోంది. మిగతా 25మంది ఎమ్మెల్యేలు కూడా పదవిని కోల్పోవాల్సి వస్తుందా…? అనే టెన్షన్ బీఆర్ఎస్ లో మొదలైంది.

Also Read : నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ – కవిత కోసమే కామారెడ్డి నుంచి పోటీ..?

Exit mobile version