Polytricks.in

బ్రేకింగ్ – డీఎస్ కు తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాజకీయ సీనియర్ నేత డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న డీఎస్ ఆరోగ్యం తాజాగా క్షీణించడంతో బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ దృవీకరించారు.

ప్రస్తుతం తన తండ్రి డీఎస్ కు చికిత్స కొనసాగుతుందని అరవింద్ వెల్లడించారు. డీఎస్ అనారోగ్యానికి గురి కావడంతో అరవింద్ తన రెండు రోజుల షెడ్యూల్ ను పూర్తిగా రద్దు చేసుకున్నారు. తన తండ్రి కోలుకుంటారని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకోస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేశారు డీఎస్. వైఎస్సార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ కు రాజ్యసభ పదవిని కట్టబెట్టింది. నిజామాబాద్ లో తన కూతురి ఓటమికి తెరవెనక డీఎస్ ప్రయత్నించారని ఆయనను కేసీఆర్ దూరం పెట్టారు.

కేసీఆర్ తో గ్యాప్ రావడంతో బీఆర్ఎస్ కి డీఎస్ దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనా ఆఖరి క్షణంలో వాయిదా పడింది.

Exit mobile version