Site icon Polytricks.in

ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తన పదవికి రాజీనామా!

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. అదే సమయంలో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైళ్లో ఉన్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇతను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను వెనువెంటనే ఆమోదించారు.

నిజానికి ఈ ఇద్దరు ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు. ఈ ఇద్దరివల్ల ఆమ్ అద్మి పార్టీ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. దాంతో కంగుతిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అందుకే ఆ ఇద్దరినీ ముందుగా రాజీనామాలు చేయమని ఆదేశించినట్లు తెలిసింది. అందుకే వాళ్ళు కిక్కురుమనకుండా రాజీనామాలు చేశారు. దానిని కేజ్రివాల్ వెంటనే ఆమోదించారు.

అంతకు ముందు సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అంతకు ముందు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సిసోడియా సుప్రీంకు వెళ్ళాడు. సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.

సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు నిన్న ఐదురోజుల రిమాండ్ విధించింది. మార్చి 4 వరకు కస్టడీకి అప్పగించింది. ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది.

                                                                                                ౦౦౦

Exit mobile version