Site icon Polytricks.in

మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కాం -మరోసారి ఊబిలో పడిన కవిత?

తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో రూ. 75 కోట్ల ముడుపులు బిఆర్ఎస్ పార్టీ కి హైదరాబాద్ లో ఇచ్చానని శుక్రవారం రాత్రి ఆరోపించారు. కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.  ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. మోడీ వార్తలు కూడా పక్కన పెట్టి ఈ వర్హను అంతర్జాతీయ మీడియా మరోసారి హైలెట్ చేసింది.

మూలిగే నక్క మీది కుక్క పడ్డట్లు మారింది ఎమ్మేలి కవిత పరిస్టింటి. ఈ దెబ్బతో ఈడి, సిఐడి లు మరోసారి కవితను ఈ కోణంలో కూడా విచారించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

డిల్లీ లిక్కర్ స్కాం లో రూ. 100 కోట్లు, లేదా అంతకుమించిన  అవినీతి జరిగింది అన్నది వాస్తవం. దాంట్లో ‘ఆమ్ ఆద్మీ’ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉన్నది అనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఇందులో ‘సాక్షులుగా’, ‘అనుమానితులుగా’ ఉన్న వాళ్లు అందరు క్రమంగా జైలుకు వెళ్లారు. సమాధిని తోవ్వేకొద్ది  ఎముకలు బయటపడినట్లు ఈ కేసు తోడే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇప్పటివరాలు ఈ స్కాం లో ఎమ్మెల్సి కవిత కేవలం అనుమానితురాలు మాత్రమే. ఆమె అక్రమంగా డబ్బు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న పిళ్ళై ఒక్కడు మాత్రం తాను కవితకు బినామిగా ఉన్నాను, దీనికి ఆమెనే బాధ్యురాలు అని చేతులు ఎత్తేశాడు. ఆ దిశగా ఈడి కేసును ప్రరిశోదిస్తోంది. తగిన ఆధారాలకోసం ఆమె సెల్ ఫోన్ లు ఈ డి తీసుకున్న విషయం తెలిసింది.

దీనికి తోడూ తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో రూ. 75 కోట్ల ముడుపులు బిఆర్ఎస్ పార్టీ కి హైదరాబాద్ లో ఇచ్చానని కొత్త ట్విస్ట్ ఇస్తూ నిన్న రాత్రి గట్టిగానే ఆరోపించాడు. అయితే ఆ డబ్బు కవితకు ఇచ్చినట్లు అతను ఆరోపించలేదు. ఒకవేళ కవితకు ఇచ్చాను అని అతను మునుముందు చెప్పితే మాత్రం ఆమెకు మరోసారి  కష్టాలు తప్పవు.

ఇతని మాటలు నమ్మదగినవా కాదా అన్నది పక్కనపెడితే, మొత్తానికి ముడుపులు బిఆర్ఎస్ కి ముట్టాయి అన్నవి దాదాపు ఖాయం అయ్యినట్లే అని అందరూ భావిస్తున్నారు. కానీ అవి ఎవరికి చేరాయి అన్నది అనే కొత్త కోణం ఇప్పుడు  మొదలయ్యింది. బిఆర్ఎస్ లో ఇప్పటివరకు కవిత మాత్రమే అనుమానితురాలు. మరో పేరు లేదు అని ఇక్కడ గమనించాలి. కానీ కవిత లోగడ ఆమె భర్తను కూడా ఇందులో ఇరికించారు. అతని మీద ఎలాంటి ఆక్షన్ తీసుకోలేదు ఈడి.

ఇక్కడ ఓ నిజం తెలుసుకోవాలి. ఒక మేకను కొస్తే ఒక్కడే తినడు. ఆ మేకును తెచ్చేది ఒకడు, దానిని కోసి ముక్కలు ముక్కలు కట్ చేసేది మరొకడు. దానిని వండేది మరొకడు. వడ్డించేది మరొకరు. కానీ అందరు కలిసి తింటారు. నేను వండాను, కానీ మేకను చంపలేదు అంటే ఎవ్వరు క్షమిస్తారు?

ఇలాంటి స్కాం డబ్బులు ఒక్కడే తీసుకోడు. తలా పిడికెడు పాపం అన్నట్లు  అందరికి పంచుతాడు. లేకపోతే అందరు కలిసి వాడ్నిని ఇరికిస్తారు. అంటే కనీసం ౩౦ నుంచి 50 మంది చేతులు ఉంటాయి. ఇప్పటివరకు వెలుగు చూసిన వాళ్ళు పదకొండు మంది మాత్రమే. ఇంకా చాలామంది బయటికి వస్తారు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

Exit mobile version