Site icon Polytricks.in

రాందేవ్ బాబాను చెప్పుతో కొట్టాలి..!

మహిళలనుద్దేశించి ప్రముఖ యోగ గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు చీరలు, సల్వార్ సూట్ లలో అందంగా ఉంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మహిళలు ఏ దుస్తులను ధరించకపోయినా తన కంటికి అందంగానే కనిపిస్తారని వివాదాన్ని రాజేశారు.

రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళలను శృంగారవస్తువులుగా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు. యోగాను మార్కెటింగ్ చేసే రాందేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలు నగ్నంగా బాగుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు నారాయణ. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపైను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో రాందేవ్ బాబా పక్కనున్న మహిళలు ఆయన్ను చెప్పుతో కొట్టాల్సిందన్నారు.

Exit mobile version