Site icon Polytricks.in

ఆవు ‘తోక’ ముడిచిన మోడీ – (కుక్క) తోక వంకర పోనీ బిజెపి!

ఏడిస్తే కానీ అమ్మ పాలు ఇవ్వదు – తిడితే కానీ ప్రభుత్వం పరిపాలించేలా లేదు. ఫిబ్రవరి 14 ను ‘ఆవును కౌగిలించుకునే దినంగా’ పాటించాలని కేంద్ర సర్కార్ ప్రజలను ఆదేశించింది. ఇది మతపరమైన చర్య అని అటు ప్రజలు – ఇటు మీడియా తిట్టే సరికి బిజెపి తోక ముడిచింది. ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు మరో జివో విడుదల చేసింది.

ఇది చూస్తుంటే బిజెపి తోక ముడిచింది అనడం కంటే, కుక్క తోక వంకర పోదు అంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి బిజెపి ఎదో ప్రయోగాలు చేయాలనీ, ఏదో అధికారం చలయించాలని చూస్తుంది. కానీ ప్రజలు, మీడియా తిట్టే సరికి భయపడి వెనుకడుగు వేస్తోంది. బురదలో కాలు వేయడం ఎలా? దానిని సర్ఫ్ పెట్టి కడుక్కోవడం ఏల?

ఓ జివోని విడుదల చేసే ముందు, లేదా ఓ చట్టం తెచ్చే ముందు దానికి సంబందించిన వారితో చర్చించాలనే అలవాటు బిజెపికి మొదటినుంచి లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? మోడీ తలుచుకుంటే జివోలకు కొదవా? రైతులకు నష్టం వాటిల్లే బిల్ ప్రవేశ పెట్టిన బిజెపి కమలం ‘ఆకులు’ కాల్చుకుంది. చేసిన తప్పును సరిచేసుకుని ఆ బిల్లును వెనక్కి తీసుకుంది. నోట్ల రద్దు విషయంలో ఇలాగే తొందర పడింది. ఇప్పుడు ‘ఆవును కౌగిలించుకునే దినం’ విషయంలోనూ అదే జరిగింది.

ప్రజలు చేసే తప్పులను ప్రభుత్వం సరిచేయాలి. కానీ ఇక్కడ ప్రభుత్వమే తప్పులు చేస్తుంటే ప్రజలు సరి చేస్తున్నారు. ఇదెక్కడి ప్రభుత్వంరా తండ్రి అని ప్రజలు వాపోతున్నారు.

Exit mobile version