Site icon Polytricks.in

ఇదేందయా జనార్దనా…అప్పుడు ఇంటర్ విద్యార్థులతో..ఇప్పుడు నిరుద్యోగులతో..!

టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదం. గతంలో ఇంటర్మీడియట్ కార్యదర్శిగా పని చేసినప్పుడు …ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఆ ఏజెన్సీ నిర్లక్ష్యంతో ప్రతిభ కల్గిన విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా 27మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అసమర్ధ అధికారి చేతిలోనే Tspsc చైర్మన్ బాధ్యతలు పెట్టి… టీఎస్ పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజ్ కు కారణమైంది.

2019లో ఇంటర్ మీడియట్ బోర్డు సెక్రటరీగా జనార్ధన్ రెడ్డి పని చేశారు. ఆ సమయంలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనాన్ని గ్లోబరీనాకు అప్పగించారు. అసలు అనుభవం లేని గ్లోబరీనా అనే ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో టాలెంటెడ్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. నాడు మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకే గ్లోబరీనా ఏజెన్సీకి ఇంటర్ మూల్యాంకనం బాధ్యతను అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ నిర్లక్ష్యానికి అమాయక విద్యార్థులు 27మంది విద్యార్థులు బలి అయ్యారు.

ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో తప్పు జరిగినట్లు సర్కార్ ఏర్పాటు చేసిన త్రిసభ కమిటీ నిర్ధారించింది. తప్పు జరిగినట్లు నాడు ఇంటర్ బోర్డు సెక్రటరీగానున్న జనార్ధన్ రెడ్డి కూడా అంగీకరించారు. ఇంటర్ ఫలితాల అవకతకవలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ చర్యలు కూడా తీసుకోలేదు. ఇది పక్కన పెడితే..ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి 27మంది విద్యార్థులు బలయ్యారు. ఆ విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలి. జనార్ధన్ రెడ్డి అసమర్ధ అధికారి అని తెలిసినా… టీఎస్ పీస్సీ చైర్మన్ గా ఆయనకు ఎందుకు బాధ్యతలు అప్పగించారో

2019లో ఇంటర్మీడియట్ బోర్డు ఓ కుదుపునకు గురైంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పరిస్థితి అలాగే ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో టీఎస్ పీఎస్సీ ప్రతిష్ట మసకబారుతోంది. దీనికి చైర్మన్‌గా నాడు ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న జనార్ధన్‌రెడ్డి ఉన్నారు. తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఆయన హయంలోనే జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, మెడికల్‌ హెల్త్‌ విభాగం పరీక్ష పత్రాలు లీకైనట్లు అధికారికంగా గుర్తించారు. తాజాగా గతంలో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో నిర్వహించే ప్రశ్నపత్రాలు కూడా లీకేజీలో కీలకమైన ప్రవీణ్‌ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : TSPSCపేపర్ లీకేజ్ లో మరో ట్విస్ట్… అసలు విషయం ఏంటంటే..?

Exit mobile version