రేవంత్ పై హైకమాండ్ పూర్తి భరోసా..అందుకే తాజా ఎంపిక..!!
తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మరో నాలుగింటిని పెండింగ్ లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదారాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వీటిని హోల్డ్ లో పెట్టేశారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి కుటుంబం పట్టు పట్టింది. కానీ, అదే స్థానం నుంచి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ టికెట్ కోసం ప్రయత్నించారు. ఇప్పటికే కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇద్దరికీ పదవులు ఉండటంతో మరొకరికి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చామలకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకు అవకాశం దక్కింది. ఆయన టికెట్ పై హామీతో కాంగ్రెస్ లో చేరారు. కానీ, ఈ స్థానం నుంచి జగ్గారెడ్డి ఫ్యామిలీ ప్రయత్నించింది. సర్వేలో నీలంకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారు. ఈయన కూడా రేవంత్ తో సన్నిహితంగా ఉంటున్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి పోటీలో ఉండనున్నారు. అదిలాబాద్ నుంచి మంత్రి సీతక్కతో సన్నిహిత ఉండే డాక్టర్ సుగుణకు ఛాన్స్ ఇచ్చారు.
తాజాగా ఖరారు అయిన నాలుగు స్థానాల్లో రేవంత్ మార్క్ కనబరిచారు. ఈ నలుగురు సీఎం కు సన్నిహితులే. హైకమాండ్ సీట్లను ఖరారు చేస్తున్నా…రేవంత్ సిఫార్సులను అధిష్టానం పరిశీలిస్తుందని చెప్పేందుకు తాజా ఎంపిక ఉదాహరణ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
రేవంత్ పై హైకమాండ్ పూర్తి భరోసా..అందుకే తాజా ఎంపిక..!!
