Site icon Polytricks.in

షర్మిలకు నో బోర్డు పెట్టేసిన కాంగ్రెస్ – షర్మిల ఏం చేయబోతున్నారంటే..?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఓ నిర్ణయాన్ని వెలువరించాలని షర్మిల డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. నేటితో డెడ్ లైన్ ముగిసినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో షర్మిల ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల ఆసక్తి కనబరిచినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అందుకు సానుకూలతగా లేదు. సీమాంధ్ర మూలాలు కల్గిన షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ కు మళ్ళీ అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని.. షర్మిల చేరిక విషయంలో హైకమాండ్ రాజకీయ పరమైన ఆలోచనలు చేసింది. ఆమె కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగోడుతుందని అంచనా వేసి షర్మిల చేరికకు రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హైకమాండ్ విధించిన షరతులకు షర్మిల నిరాకరించడం కూడా ఆమె పార్టీ విలీనం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ లో విలీనం విషయంలో క్లారిటీ రావడంతో షర్మిల ఒంటరిపోరుకు సిద్దం కావాలని భావిస్తున్నారు. వైఎస్ఆర్టీపీలో పని చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పని చేసిన నాయకులను కూడగట్టె పనిలో బిజీ అయ్యారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సరిగా లేరు. దీంతో ఆలస్యం చేయకుండా ఎన్నికలపై ఆమె దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ఒకటి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. పాలేరు, ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా షర్మిల ఆలోచిస్తున్నారు.

Also Read : తొందర్లోనే కవిత అరెస్ట్ – ఆ తరువాత పెద్దాయనే టార్గెట్..?

Exit mobile version