Site icon Polytricks.in

రేపటి పదో తరగతి పరీక్షల మీద నెలకొన్న గందరగోళం?

ఈరోజు ఉదయం పదో తరగతి పరీక్షలు మొదలు అయ్యాయి. పరీక్ష మొదలు కాగానే కేవలం ఏడు నిముశాలల్లో వికారాబాద్ లో తెలుగు ప్రశ్న  పేపర్ వాట్స్ ఆప్ లో విడుదలయ్యి సంచలనం  రేపింది. ఇప్పుడు ఈ పరీక్ష ఉన్నట్లా? లేక రద్దు అయ్యినట్లా? అనే సందేశం విద్యార్థులను పట్టి పీదితోంది.

దీనికి తోడు రేపటి నుంచి జరగవలసిన మిగతా పరీక్షలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే టెన్షన్ విద్యార్థులలో మొదలయింది.

దీనికిపై తెలంగాణ విద్య శాఖా డైరెక్టర్ దేవసేన అధికారికంగా ప్రకటన ఇచ్చారు. రేపటినుంచి జరగవలసిన పదో తరగతి పరీక్షలు యదావిధిగా కొనసాగుతాయి అని ఆమె చెప్పారు. ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులు, వాళ్ళ తల్లి దండ్రులు ఎలాంటి ఆందోళన చెందరారు అని చెప్పారు.

అయితే వాట్స్ ఆప్ లో ఈరోజు పేపర్ లీక్ అయ్యిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆమె చెప్పారు. దేని వెనక ఇంకా ఎవ్వరు ఉన్నారో తెలుసుకోవాలని వికారాబాద్ ఎస్పి అయిన నారాయణ రెడ్డిని ఆదేశించినట్లు ఆమె చెప్పారు.

అయితే ఈ రోజు వాట్స్ ఆప్ లో లీక్ అయ్యిన తెలుగు పేపర్ పరీక్ష ఉన్నట్లా? రద్దు అయ్యినట్లా? అనే అంశం మీద ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మేము న్యాయ నిపుణులను ప్రత్యేకంగా అడిగాము. సామాన్యంగా ఇలాంటి పరీక్షలు రాద్దు కావు. ఎందుకంటే పరీక్ష ఈరోజు ఉదయం 9:౩౦ లకు మొదలు అయ్యింది. అంటే పరీక్ష ప్రశ్నా పత్రాలు విద్యార్థులు అప్పటికే చూశారు. కానీ ఉదయం 9: 37 లకు, అంటే ఏడు నిముషాల తర్వాత బయటికి పొక్కింది.

దీనిని చూసి కాపి కొట్టే అవకాశం ఎవ్వరికి లేదు. అల్ రెడీ విద్యార్థులు పరీక్ష హాలులో కూర్చున్నారు. బయటినుంచి పరీక్ష హాలులోకి ఎవ్వరిని రానివ్వలేదు. అలాగే పరీక్ష హాలులో ఉన్నవాళ్ళను బయటికి వెళ్ళనివ్వలేదు. కాబాట్టి కాపీ జరిగే అవకాశం దాదాపు  లేదు. అందుకే ఈ పరీక్ష బహుశ రద్దు కాకపోవచ్చు అని తలలు పండిన న్యాయ నిపుణులు అభిప్రాయ పడ్డారు. కానీ ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావడంలేదు. తుది నిర్ణయం విద్య శాఖ మంత్రి చెప్పాలి.

Exit mobile version