Site icon Polytricks.in

జనాభాను పెంచే భాద్యత కాలేజీ విద్యార్థులదే.!అదెలా మరి…?

ప్రపచంలోనే జనాభా విషయంలో చైనా అగ్ర స్తానంలో ఉన్నా సంగతి మనందరికీ తెలుసు.కాని కొన్ని సంవత్సర నుండి చైనాలో ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని చెప్పిన చైనా ప్రభుత్వం మళ్ళి ఇప్పుడు ఎందరికైన జన్మనివోచ్చు అంటూ కీలక నిర్ణయం తీసుకుంది.ఒక్కరే అనే ప్రాసెస్స్ వల్ల చైనా జనాభా రేటు చాలా తగ్గి భవిష్యత్ కష్టమని భావించి మళ్ళి ఇలాంటి నిర్ణయాలు చైనా ప్రభుత్వం తీసుకొని ఉండొచ్చని చైనా నెటిజన్లు వెల్లడిస్తున్నారు.

ఒక కుటుంబంలో ఒక్కరినే కనాలి అని చెప్పిన నాటి నుండి ఇప్పటి వరకు యువకుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ,వృద్దుల రేటు రోజు రోజుకు పెరుగుతుంది.కాబట్టి భవిష్యతు పరిణామాలను ముందుగానే పసిగట్టి యధావిధిగా కొనసాగించవచ్చు అని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అయితే పడిపోతున్న జనాల రేటును కాపాడుకునే ప్రయత్నంలో చైనా మళ్ళి సంచలన నిర్ణయం తీసుకుంది. కాలేజీలోని విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. విద్యార్థులు ప్రేమించుకోవాలని.. పిల్లలను కనాలంటూ విద్యార్థులకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు “ప్రేమలో పడటానికి” వారం పాటు సెలవులు ఇస్తూ కాలేజీ యాజమాన్యాలు ఆదేశాలు జారిచేశాయి.

కళాశాలల్లో ఒకటైన మియాన్యాంగ్ ఫ్లయింగ్ వొకేషనల్ కాలేజ్ మొదట విద్యార్థులకు మార్చి 21న ఈ విరామం ప్రకటించి. శృంగారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు విద్యార్థులు “ప్రకృతిని ప్రేమించడం. ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని సూచించింది. అంతేకాదు.. విద్యార్థులకు రోజువారీగా డైరీలు రాయడం వ్యక్తిగత హానీమూన్ రికార్డ్ చేయడం వారి ప్రయాణాల వీడియోలను చిత్రీకరించడం వంటి అవగాహన కలిగే విధంగా శిక్షాణా ఇస్తున్నారు.

పడిపోతున జనాభా రేటును పెంచేందుకు ప్రభుత్వం ఇదంతా చేర్చి జనాభాను పెంచే ప్రయత్నంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.1980 నుంచి 2015 మధ్య కాలంలో చైనాలో అమలులోకి వచ్చిన ఒక జంటకు ఒకే బిడ్డ విధానం వల్ల చైనాలో జనాభా భారీగా తగ్గిపోయింది.

చైనా యువకులు అధిక పిల్లలుంటే వారి సంరక్షణ విద్య ఖర్చులకు మరియు వారిని పెంచేందుకు అయ్యే ఖర్చులకు భయపడి పిల్లలను కనడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. మరోవైపు తక్కువ ఆదాయాలు బలహీనమైన సామాజిక భద్రతా పిల్లలు కనకుండా చైనా యువతనుఅక్కడి ప్రభుత్వం మభ్య పెడుతున్నాయి.

గత ఏడాది ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా జనాభా తగ్గిపోతున్నట్లు సర్వే ప్రకారం వెల్లడించారు.అందుకు చైనా అప్రమత్తమై కాలేజీ విద్యార్థులకు సెలవులు ఇస్తూ ప్రేమించుకోండి.. పిల్లలను కనండి అంటూ ప్రోత్సహిస్తోంది.

Exit mobile version