Site icon Polytricks.in

బీఆర్ఎస్ లోకి కొండా – క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానం ప్రదర్శించడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చ ప్రారంభమైంది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరిస్తోన్న నేపథ్యంలో పాత మిత్రులను కేసీఆర్ కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటలతోపాటు గతంలో పార్టీని వీడి వెళ్ళిన నేతలకు కేసీఆర్ గాలం వేస్తున్నారని కథనాలు వచ్చాయి.

బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత లేక అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నారనే వార్తను ఓ పత్రిక ప్రచురించింది. అలాగే, ఈటల బీజేపీలోనే కంటిన్యూ అవుతారా ..? ఆయన కూడా జంప్ చేస్తారా..? అని రెండు వార్తలను ప్రచురించడంతో…ఆ పేపర్ క్లిప్పింగ్ లను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొండా పార్టీ మార్పుపై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ అంత తెలంగాణ ఉద్యమ ద్రోహులతో నిండిపోయిందని…ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వర్ రావు, మల్లారెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు ఫొటోలు ఉణ్నాయి. ఇలాంటి తెలంగాణ వ్యతిరేకులే బీఆర్ఎస్ లో ఉన్నారన్నారు.

పార్టీ నిండా తెలంగాణ ఉద్యమ ద్రోహులను పెట్టుకున్నా బీఆర్ఎస్ లోకి తనెందుకు వెళ్తానని అర్థం వచ్చేలా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ కనిపిస్తోంది.

Exit mobile version