Site icon Polytricks.in

మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో సిఐడి దాడులు?

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఆదేశాల మేరకు ఏపి సిఐడి అధికార్లు మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత  నారాయణ కూతురు ఇంట్లో దాడులు నిర్వహించారు. నారాయణ కుమార్తె కుకట్ పల్లి లోని లోధా బెల్లెజా అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. ఆయన కూడా ఆ ఇంట్లో ఉన్నారని పక్కా సమాచరం అందిన తర్వాత ఒక్కసారిగా దాడులు చేశారు.

పదో తరగతి పరీక్ష పత్రాల లికేజ్ వ్యవహారంలో అయన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రోజుకు ఆరు గంటలు ఆయనను, ఆయన బంధువులను విచారించవచ్చు అని కోర్ట్ అనుమతి ఇచ్చింది. లోగడ ఆయనకు ఆపరేషన్ జరిగిన కారణంగా విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఆయన ఏదోఒక సాకు చూపి తప్పించుకున్తున్నారని సిఐడి కోర్టులో కేస్ వేసి ఈ అనుమతి తీసుకుంది. కేవలం పదో తరగతి పరీక్ష పత్రాల లికేజ్ వ్యవహారం కాకుండా ఆయన మీద ఉన్న ‘రింగ్ రోడ్’ వ్యవహారం గురించి కూడా నిలదిసినట్లు తెలిసింది.

అక్కడితో ఆగకుండా సిఐడి అధికారులు కొండాపూర్, గచ్చి బౌలి లో ఉన్న ఆయన ఆఫీసుల మీద కూడా దాడులు చేసి కొన్ని విలువైన పత్రాలను స్వాదినం చేసుకున్నట్లు తెలిసింది.

Exit mobile version