Site icon Polytricks.in

చిరుతో రాధిక సినిమా

రాధిక- మెగాస్టార్ చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే వీరిద్దరి జోడికి అత్యధికులు అభిమానులుగా నిలిచారు.

చాలా సినిమాలో నటించడం వలన వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఏ ఇంటర్వ్యూలోనైనా చిరును గుర్తు చేస్తుంది రాధిక. చిరును కూడా అంతే. రాధిక పట్ల అమితమైన అభిమానం చూపిస్తుంటారు. ఇప్పుడు అదే స్నేహంతో రాధికతో సినిమా చేసేందుకు చిరు ముందుకొచ్చారు.

రాధిక సొంత బ్యానర్ రాడాన్ లో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ గురించి చర్చలు జరుగుతున్నాయి. కథా ఫిక్స్ అయితే చిత్రీకరణ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

చిరుతో సినిమాను ఫైనలైజ్ అవ్వడంతో రచయితలతో రాధిక సంప్రదింపులు జరుపుతున్నారు. తమ జోడికి తగ్గట్లుగా ఎవరి దగ్గర కథ ఉందో సెర్చ్ చేస్తున్నారు. అదే సమయంలో , చిరు కూడా కథ కూడా కోసం ట్రై చేస్తున్నారట.

చిరు ఓ లైన్ అనుకున్నారట. ఆ లైన్ లో కథ రెడీ చేసే బాధ్యతను ఇద్దరు రైటర్స్ కు అప్పగించినట్లు సమాచారం. కొత్త ఏడాదిలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version