Site icon Polytricks.in

మీ కాళ్ళకు దండం పెడుతా – సీనియర్లకు చిన్నారెడ్డి విన్నపం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్లు రేవంత్ కు సహకరించాలని కోరారు. అన్ని తెలిసిన పెద్ద నాయకులే తప్పు చేస్తున్నారని, కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం నమ్మకంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ డీసీసీ అద్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం సభను ఏర్పాటు చేశారు. ఈసభకు చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పంచాయితీ నేపథ్యంలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని తెలిసి కూడా సీనియర్లు తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని కితాబిచ్చారు. దయచేసి సీనియర్లు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ,మీ కాళ్ళకు దండం పెడుతానంటూ ఎమోషనల్ అయ్యారు.

Exit mobile version