Site icon Polytricks.in

వైఎస్సార్ టీపీ విలీనం – కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా యువ నేతకు ఛాన్స్..?

వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ఖాయంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు సఫలమయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే..ఏపీలో రాజకీయం చేసేందుకు అవకాశమిస్తాం. తెలంగాణలో మాత్రం కుదరదని షర్మిలకు గతంలో ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పడంతో వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన వీగిపోయింది. మళ్ళీ ఇంతలోనే విలీనం ఖరారు అయినట్లు తేలడంతో ఏం జరిగిందనే చర్చ జోరుగా కొనసాగుతోంది.

తెలంగాణతోపాటు ఏపీలోనూ కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తానని షర్మిల చెప్పడంతోపాటు మూడు సీట్లు తమకు ఇవ్వాలని బెట్టు చేసినట్లు సమాచారం. అందుకు హైకమాండ్ పెద్దలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య లేదు కాని, ఏపీలో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య ఎదురు అవుతోంది. దాంతో షర్మిల అక్కడ ప్రచారం చేస్తానని అంగీకరించడంతో ఆమె కోరినట్లుగా మూడు సీట్లు ఇస్తామని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెప్పిందనే టాక్ నడుస్తోంది.

షర్మిల కోరిన ఆ మూడు సీట్లు ఏవి..? అనే చర్చ పోలిటికల్ సర్కిల్లో విస్తృతంగా జరుగుతోంది. మూడు స్థానాల్లో తమకు గెలుపు గుర్రాలు ఉన్నారని షర్మిల చెప్పిన దరిమిలా ఆమె చెప్పిన ఆ ముగ్గురు మొనగాళ్ళు ఎవరనే చర్చ నడుస్తోంది. కల్వకుర్తి, తుంగతుర్తి, పాలేరు సూర్యాపేట అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని షర్మిల కోరింది. పాలేరు, తుంగతుర్తికి ఒకే చెప్పిన కాంగ్రెస్ పెద్దలు…కల్వకుర్తి, సూర్యాపేట సీట్లపై హామీ ఇచ్చేందుకు ససేమీరా అన్నారని తెలిసింది. షర్మిల బెట్టు చేయడంతో చివరికి కల్వకుర్తి సీటు ఇస్తామని.. సూర్యాపేటకు మాత్రం స్కోప్ లేదని తేల్చి చెప్పారని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తొలుత కల్వకుర్తి నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ ను కాదని మరో అభ్యర్థికి సీటు ఇవ్వలేమని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిసింది. కానీ ఆమె పార్టీ తరుఫున చేయించిన మూడు సర్వే ఫలితాల్లో చీమర్ల అర్జున్ రెడ్డి ముందంజలో ఉన్నట్లు షర్మిల హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. తాము కూడా సర్వే చేయిస్తామని అందులోనూ చీమర్ల అర్జున్ రెడ్డి పేరు వస్తే అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి ఎం జరుగుతుందో..!!

Exit mobile version