Site icon Polytricks.in

బిగ్ న్యూస్ – పోలీసు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ డేట్స్ మార్పు

తెలంగాణలో పోలీసు విభాగం ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. తాజాగా పరీక్ష తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన చేసింది.

సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాని తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం మార్చి 11న ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అంటే, ఒకరోజు ముందుకు జరిపారు.

కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసింది.

Exit mobile version