Site icon Polytricks.in

వైసీపీనీ మోస్తోంది ‘ఆ నలుగురు’ – చితి పెట్టే ఇదో ఎమ్మెల్లే రెడీ అయ్యాడా?

మనిషి బతికుండగా ఎలాంటి  వాడో మోసేది  ‘ఆ నలుగురు’. అదే మనిషి ఛస్తే మోసేది కూడా ‘ఆ నలుగురే’. అందుకే నలుగురితో బాగుండాలి అని పెద్దలు అంటారు. శవాన్ని ‘ఆ నలుగురు’ మోశారు అంటే నిప్పుడు పెట్టడానికి ఐదోవాడు రెడీ అవుతాడు. ఆ తర్వాత చితి మీద కట్టెలు పేర్చేందుకు మిగతా వాళ్ళు కూడా తోడవుతారు.  ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే.

మొన్న జరిగిన ఎన్నికలలో జగన్ మనుషులు క్రాస్ ఓటింగ్  కు పాల్పడి తెలుగు దేశం పార్టీని  గెలిపించిన ‘ఆ నలుగురు’ ఎమ్మెల్యేలు – ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని ముందుగా వార్తను మా ‘పాలీ ట్రిక్స్’ వెలుగులోకి తెచ్చింది. చివరికి అదే నిజమైంది. ‘ఆ నలుగురు’ వైసీపీ పార్టీ పరువును చంపేశారు. ‘ఆ నలుగురు’ ఇప్పడు ఆ పాడెను మోయాలని చూస్తుంటే ఏకంగా చితి పెట్టడానికి మరో వైసీపీ ఎమ్మెల్లే రెడీ అవుతున్నాడు.

అతను ఎవరోకాదు –  కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డి. ఆయన సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి కొడుకు. తండ్రి రాజకీయ వారసత్వం అందుకున్న వాడు. లోగడ వైసీపీ లో క్రియాశీల రాజకీయాలల్లో  జగన్ కు కుడిభుజం లా ఉండేవాడు. అతనికి మంత్రి పదవి ఇస్తాడని అందరు అనుకున్నారు. కానీ జగన్ ఇవ్వలేదు.  నిప్పు రవ్వలు అంటుకున్నాయి.

ఆ తర్వాత కనీసం కార్పొరేషన్ పదవి కూడా రాలేదు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డి  అలకపాన్పు ఎక్కడు. జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత కనీసం వైసీపీ తరపున ప్రెస్ ముందు మాట్లాడి పరువు దక్కించుకునే ‘అధికార ప్రతినిధి’ హోదాకూడా దక్కలేదు.

అక్కడినుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డి జగన్ తో ఆంటీముట్టనట్లు  దూరంగా ఉంటున్నాడు. జగన్ కి కోపం వచ్చి అతని నియోజక వర్గానికి ఇవ్వవలసిన నిధులు ఆపేసారు. చాలా బిల్లులు కావాలని పెండింగ్లో పెట్టారు. దానితో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎలాంటి అధికారిక సభలకు సభలకు జగన్ పిలువలేదు.

దీనిని తెలుగుదేశం తెలివిగా వాడుకోవాలని పావులు కదుపుతోంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డి.కి రెడ్ కార్పెట్ వేస్తోంది. లోగడ అతను తెలుగుదేశం వాడే. అన్ని పాత పరిచయాలే. నెల్లూరు జిల్లా వైసీపీ కి కంచుకోట లాంటిది. ఇప్పటికే ఈ  జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ కి దూరం చేసింది తెలుగుదేశం. ఇప్పడు ఇదే జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డిని తమ వైపు తిప్పుకుంటే ఆ జిల్లాను క్లీన్ స్వీప్ తో గెలవవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. అందుకే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  రెడ్డి కూడా వైసీపీ నుంచి బయటికి వచ్చి తెలుగుదేశంలో చేరేందుకు రంగం దాదాపు సిద్దమయింది.

Exit mobile version