Site icon Polytricks.in

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కీలక నేతలు..?

బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. అసంతృప్త నేతలు కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఒకటి, రెండు చోట్ల అభ్యర్థులను మార్చుతామని కేసీఆర్ ప్రకటనతో తమకు అవకాశం దక్కకపోదా..? అని మరికొంతమంది నేతలు వెయిట్ అండ్ సీ అనే ధోరణితో ఉన్నారు.

కేసీఆర్ సన్నిహితులుగా ముద్రపడిన నేతలు, టికెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నటువంటి నేతలు కొంతమంది కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టికెట్ ఇస్తామని హామీ ఇస్తే గోడ దూకుందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కీలక నేతలతో ఈ సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది.

ప్రధానంగా తుమ్మల , జలగం వెంకట్రావు, వేముల వీరేశం, ఎడ్ల సుధాకర్ రెడ్డి, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, నీలం మధులు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. వీళ్ళతో మాట్లాడుతూనే కాంగ్రెస్ నేతలు అక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తోన్న నేతలతో మాట్లాడుతూ ఎవరో ఒకరిని బుజ్జగించి వీళ్ళను కాంగ్రెస్ లోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు.

Also Read : బిగ్ న్యూస్ – తన వర్గం నేతలతో కాంగ్రెస్ లోకి హరీష్ రావు..?

Exit mobile version