Site icon Polytricks.in

TSPSC ప్రశ్నా పత్రాల లీక్ కేసులో బిజెపి సంచలనం ; ఈడి ని రంగంలో దింపింది కేటిఆర్ ని టార్గెట్ చేయడానికా?

బిజెపి రాజకీయ కోణంలో కేసిఆర్ ని టార్గెట్ చేయాలనీ టి ఎస్ పి ఎస్ సి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఈడి ని కావాలని రంగం లోకి  దింపింది అని బిఆర్ఎస్ నేతను కన్నెర్ర చేస్తున్నారు. ఉరుములు లేని పిడులా నిన్న ఒక్కసారిగా ఈడి ఈ కేసుని సుమోటోగా తీసుకుని అందరికి ట్విస్ట్ ఇచ్చింది.

నిజానికి ఇది కొత్త ట్విస్ట్ కాదు. న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను ఇరికించి కావలసినంత రాజకీయ లబ్దిని బిజెపి పొందింది. అదే ఫక్కీలో ఇప్పుడు కేటిఆర్ ని కూడా ఈడి కార్యాలయం చుట్టూ తిప్పి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది అని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్త్సున్నారు. ఎవరు తప్పు చేశారు అన్నది తరువాతి విషయం. ముందు బురద చల్లితే ఆటోమేటిక్ సబ్బు కొని దానిని ఉతికేసు కుంటారు అన్నది రాజకీయం ఫిలాసఫీ. దీనితో ముందుగా రాజకీయ లబ్ది లభిస్తుంది.

అందుకే మొదటి దశలో బిజెపి తెలంగాణ శాఖా అధ్యక్షుడు  బండి సంజయ్ ని వాడుకుంది. టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ లో ఐటి శాఖ మంత్రి కేటిఆర్ హస్తం ఉన్నది అని ఆయన గగ్గోలు పెట్టారు. ఆ నిందలను తిప్పి కొట్టాలని కేటిఆర్ కౌంటర్ గా బండి మీద పరువుదావా నష్టం వేశారు. దానిని ఎన్కౌంటర్ గా బిజెపి కావాలని ఇప్పుడు ఈడి ని రంగంలోకి దింపింది. ఎత్తుకు పై ఎత్తు వేసింది అని రాజకీయ పండితులు చెపుతున్నారు.

ప్రశ్నపత్రాలు లీక్ కాగానే మూడు పరీక్షలను బోర్డు రద్దు చేసి చేతులు దులుపుకుంది. అక్కడితో ఆ కేసు పూర్తి అవుతుంది అనుకున్నారు. కిందిస్టాయి ఉద్యోగులు ఈ స్కాం చేశారు అని తప్పుకోడానికి పెద్దలు చూశారు. అయితే పెద్దవాళ్ళ ప్రమేయం లేనుండా చిన్నవాళ్ళు ఈ స్టాయిలో అవినీతికి పాల్పడరు అని ‘సిట్’ ఉన్నత అధికారి ఏ ఎమ్ శ్రీనివాస్ అనుమానం. అందుకే ఆ దిశగా అపరాధ పరిశోధన మొదలు పెట్టారు.

బోర్డును వెంటనే రద్దు చేయాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. గవర్నర్ దీని మీద నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారి చేశారు.

ఇప్పుడు ఈ కేసులో టీఎస్ పీఎస్సీ బోర్డ్ ఛైర్మన్ జనార్ధనరెడ్డితో పాటు మరో ఏడుగురు సభ్యులలో ఎవ్వరయిన దోషులుగా తేలితే మాత్రం ఈ బోర్డ్ ను రద్దు చేయాలనీ శ్రీనివాస్ సిఫార్సు చేయవచ్చు. ఈ రెండో దశ పూర్తి కాగానే ఆయన మూడో దశలో అసలు రాబంధువులను కూడా వదిలి పెట్టరాని తెలుస్తోంది. ఇప్పుడు ఈడి కూడా తోడూ కావడంతో కేసు రసవత్తరంగా సాగుతుంది. గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version