Site icon Polytricks.in

అసెంబ్లీ లో బిజెపి ఎమ్మెల్లే బూతు సినిమా?

అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యం దేవాలయం. అందులో కూర్చునే కొన్ని గంటలు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజా ప్రతినిధులు చర్చించాలి. కానీ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు వేడి వేడిగా జరుగుతుంటే తనకేమి పట్టనట్లు ఓ ఎమ్మెల్లే తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూస్తూ వేడెక్కి పోతున్నాడు. వెనక సీట్ లో కూర్చున్న ప్రతిపక్ష ఎమ్మెల్లే దీనిని తన మొబైల్ లో షూట్ చేసి మీడియాలో పెట్టాడు. ఇప్పుడు అది వైరల్ గా మారి  బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

ఆ ఎమ్మెల్లే, దేశ భక్తుడిని చెప్పుకు తిరిగే ఆ ఎమ్మెల్లే  ఎవ్వరో కాదు, సాక్షాత్తు బిజెపి పార్టీకి చేయిందిన హిందూవాది. త్రిపుర లోని బాగ్ బస్సా నియోగకవర్గం బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్లే జాదెవ్‌ లాల్‌. ‘హిందు మతధర్మాలు’ అని నినాదాలు ఎత్తుకున్న బిజెపి నేడు తన ఎమ్మెల్లే బూతు చేష్టను ఎలా సమర్థిస్తుందో చూడాలిమరి. లోగడ కర్ణటకలో కూడా ఇద్దరు ఎమ్మెల్లేకు అసంబ్లీలో ఇలాగే బ్లూ సినిమాలు చూస్తుంటే ఆ ప్రభుద్దులను పదవులనుంచి తొలగించిన విషయం మీకు తెలిసిందే.

Exit mobile version