Site icon Polytricks.in

ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో బిగ్ ట్విస్ట్..!!

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కార్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలనుకున్న ప్రభుత్వానికి ఝలక్ తగిలింది.

ఆర్టీసీ బిల్లు ఆర్థికపరమైనది కావడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. దాంతో ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్ కార్యాలయానికి బిల్లును పంపించామని ప్రగతి భవన్ వర్గాలు అంటుండగా… రాజ్ భవన్ వర్గాలు మాత్రం ఈ వాదనను తోసి పుచ్చుతున్నాయి. తమకు ఆర్టీసీ బిల్లు అందలేదని చెబుతున్నాయి. దాంతో ఆర్టీసీ బిల్లు విషయంలో గందరగోళం చోటుచేసుకుంది.

ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్నారు. ఇందుకు ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనుకున్నారు. కానీ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. మరి అప్పటికి వరకు గవర్నర్ కార్యాలయం ఆర్టీసీ బిల్లుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వెనక పెద్ద స్టొరీ..!

Exit mobile version