Site icon Polytricks.in

అయ్యో పాపం.. ఈటలకు మళ్ళీ కష్టమొచ్చి పడిందే..!!

బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తేనే పార్టీలో కొనసాగుతామని పట్టుబట్టి ఎట్టకేలకు సక్సెస్ అయిన ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీలో రిలాక్స్ గా ఉండటం లేదు. బండిని తప్పిస్తే అంత సెట్ అవుతుందని హైకమాండ్ పెద్దలకు చెప్పారు ఈటల. అగ్రనాయకత్వం ఈటలను గౌరవించి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అయినా నేతలు బీజేపీని వీడితే ఈటలపై అగ్రనేతలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆయన ఇప్పుడు పార్టీని వీడాలని ఆలోచన చేస్తోన్న నేతల లిస్టును రాసుకొని ఒక్కొక్కరిని బుజ్జగించే బాధ్యతను తీసుకున్నారు.

పార్టీలో చేరుతారని నమ్మకం పెట్టుకున్న నేతలు బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని కమలం గూటికి చేరడం లేదు. కాంగ్రెస్ లో చేరుతున్నారు. చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. వారిని బీజేపీలోనే ఉంచడం ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గానున్న ఈటలకు ఇప్పుడు టాస్క్. చేరికల కమిటీ చైర్మన్ గా ఒక్క నేతను పార్టీలోకి తీసుకురాలేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గా నియామకం అయ్యాక ఇప్పుడు వలస నేతలను కాపాడుకునే ప్రయత్నంలో బిజీ అయిపోతున్నారు.

మాజీమంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారని తెలియగానే ఆయన ఇంటికి వెళ్ళారు ఈటల. ఆయన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. కొంతకాలం ఆగాలని చంద్రశేఖర్ కు ఈటల సూచించినప్పటికీ ఆయన పెద్దగా మనస్సు మార్చుకోలేదని..కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం ఇప్పించి ఆయన్ను శాంతపరిచారు. అయితే.. చాలామంది నేతలు అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. వారిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Exit mobile version