Site icon Polytricks.in

కొడంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

ఎన్నికలకు సమయం ముంచుకొస్తోన్న వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింగి. ఆ పార్టీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అసంతృప్త నేత గురునాథ్ రెడ్డితో భేటీ అయ్యారు.

శుక్రవారం ఉదయం గురునాథ్ రెడ్డి నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించగా.. అందుకు ఆయన ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముద్దప్పలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

7 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన గురునాథ్ రెడ్డి కొడంగల్ లో తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నారు. 2018ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున గురునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తారని అనుకున్నా చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి పట్నం నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం గురునాథ్ రెడ్డి కృషి చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచాక గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదు. ఇదిగో.. అదిగో ఎమ్మెల్సీ అంటూ ఊరిస్తూ వస్తున్నారు తప్పితే ఆయనకు ఏ పదవి కట్టబెట్టలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు.

గురునాథ్ రెడ్డి అసంతృప్తిని గ్రహించిన రేవంత్ రెడ్డి తాజాగా ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. కొడంగల్ ఎమ్మెల్యే పనితీరు, వ్యవహారశైలిపై చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ రానున్నారు. ఆమె సమక్షంలోనే గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.

Exit mobile version