Site icon Polytricks.in

భాను ప్రయాణంలో… మరో ఉదయం

ఆమె బాట…. పూల బాట కాదు
ఆమె ప్రయాణం… నల్లేరుపై నడక కాదు
అనుకున్న గమ్యం దిశగా సాగిన గమనంలో
ఎంచుకున్న లక్ష్యం దిశగా నడిచిన ప్రయాణంలో
ఆటుపోట్లు ఎదుర్కొంటూ
కష్టాలు ఓర్చుకుంటూ
కన్నీళ్లను దాచుకుంటూ
మనసులో చీకట్లు కమ్ముకున్నా
మోముపై చిరునవ్వులు చిందిస్తూ
అందరికీ ఆత్మీయ పలకరింపుగా మారారు
విమర్శల రాళ్లను విజయ సౌధానికి పునాదిగా మలచుకున్నారు
పేరు చెబితే… పరిచయం అవసరం లేని స్థాయికి చేరుకున్నారు.


https://youtu.be/Vz-Ro_8UR9E

ఆమెది.. తలవంచని వ్యక్తిత్వం…. ముక్కుసూటి మనస్తత్వం
కల్మషమెరుగని చిరునవ్వుతో… ఆత్మీయ పలకరింపుతో
ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు
టీవీ రంగంలో ఠీవీగా నిలిచారు.

ఆమె… తెలుగునాట తొలితరం యాంకర్
ఆమెది… బుల్లితెరపై అలుపెరుగని కెరియర్
విరామమే తప్ప… విరమణ ఎరుగని ప్రయాణంలో
యూట్యూబ్ వేదికగా
మనతో మరిన్ని ముచ్చట్లు చెప్పేందుకు వస్తున్నారు….
ఆమె….. మరెవరో కాదు….
ప్రేక్షకుల మదిలో ప్రతిధ్వనించే ‘హృదయాంజలి’….. ఉదయభాను.

Exit mobile version