Site icon Polytricks.in

కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యత – మొదటి లిస్టులో 15మంది బీసీ నేతలు..!?

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రెండు రోజు సమావేశమైంది. షార్ట్ లిస్టును పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీ అయింది స్క్రీనింగ్ కమిటీ. అయితే.. బీసీలకు ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా.. పార్టీ కూడా బీసీలకు ఈసారి గణనీయమైన సీట్లు ఇస్తామని హామీ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు బీసీ నేతలు. మొదటి జాబితా సామజిక సమీకరణలు కలిసి వచ్చేలా అభ్యర్థుల కూర్పు రెడీ అవుతోంది.

మొత్తం 60మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఫైనల్ చేస్తున్నారు. ఇందులో బీసీ నేతలే ఎక్కువ ఉండేలా జాబితాను రెడీ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ బీసీలకు కేవలం 21స్థానాలే ఇవ్వడంతో ఆ సామజిక వర్గం ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలను తమవైపు తిప్పుకుంటే కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం ఈసారి ఎలాగైనా బీసీ అభ్యర్థులకు అధిక సీట్లు ఇచ్చి… బీసీల మెప్పు పొందాలని టీపీసీసీ ఆలోచిస్తోంది. బీసీలలోని అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించేలా అభ్యర్థులను ఖరారు చేస్తోంది కాంగ్రెస్. మొదటి జాబితాలో 12నుంచి 15 మంది బీసీ అభ్యర్థులు ఉండనున్నారని సమాచారం.

వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ

ఎల్బీ నగర్ – మధుయాష్కీ

హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్

గోషామహల్ – మెట్టు సాయి కుమార్

నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్

నారాయణ ఖేడ్ – సురేష్ షెట్కర్

ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్

శేరిలింగంపల్లి – జెర్పేటి జైపాల్

నారాయణపేట – ఎర్ర శేఖర్

నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్

ఆలేరు – బీర్ల ఐలయ్య

షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్

Also Read : ప్లాప్ అయిన కేసీఆర్ ప్లాన్..!!

Exit mobile version