Site icon Polytricks.in

కటకటాల పాలయిన ‘బండి’ ; ఇప్పుడు హీట్ ఎక్కిన అసలు ‘ఇంజన్’?

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని నిందితుడిగా నమ్మి,  హన్మకొండలోని మొదటి సెషన్స్ కోర్ట్ జడ్జి రాపోలు అనిత, అతనికి 14 రోజుల రిమైండ్ కస్టడి విదిస్తూ జైలులు పంపారు.

ఇటు తెలంగాణాలో అటు న్యూ ఢిల్లీ లో నిన్న జరిగన తీవ్ర పరిణామాల మధ్య, సెక్యూరిటీ కారణాల దృశ్య బండిని ఖమ్మం జైలుకు బుధవారం రాత్రి తరలించారు.

ఈ కేసులో బండిని ఏ1 గా , వాట్స్ ఆప్ లో ప్రశ్న పత్రం పంపి, 142 మెసేజులు పెట్టిన ప్రశాంత్ ని ఏ2 గా, దీనిని సహకరించిన మహేష్ ని ఏ౩ గా, మైనర్ బాలుడు ఏ4 గా, మోతం శివ గణేష్ని  ఏ5 గా, పోగు సుబాష్ ని ఏ6 గా, పోగు శశాంక్ ని ఏ7 గా, దూలం శ్రీకాంత్ ని ఏ8 గా, పెరుమాండ్ల శ్రామిక్ ని ఏ9 గా, పోతబోయిన వర్షిత్ ని ఏ10 నిందితుడిగా కేసు నమోదు చేశారు.

ఇందులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు, మిగతావాళ్ళు పరారిలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఇందులో దాదాపు చాలా మంది బిజెపి కార్యకర్తలే అని పోలీసులు తెలిపారు. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర అని చెప్పారు. కేవలం రెండు గంటల వ్యవధిలో ప్రశాంత్ 142 సార్లు బండి సంజయ్ కి ఫోన్ చేశాడు అని పోలీసులు డేటా మీడియాకు చూపారు.

రేపటినుంచి పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్ల ముందు నిరాహార దీక్షలు చేసి, పరీక్షలు జరగకుండా అడ్డుకోవాలి అనే సందేశాలు ప్రశాంత్ వేల మందికి పంపాడు. అయితే ఇవి బండి ఇచ్చిన ఆదేశంగా తెలిసింది. ఇక్కడితో ఆగకుండా రోజుకో పరీక్షా పత్రం విడుదల చేసి కెసిఆర్ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేయాలి అని కుట్ర పన్నునారు. ఇదంతా బండి సంజయ్ చేసినట్లు కోర్ట్ బలంగా నమ్మింది. అతను బయట ఉంటే ఇలాంటి కుట్ర అమలు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని కోర్ట్ ఆందోళన చెందింది. అందుకే కావాలనే బండి ని కోర్ట్  జైలుకు పంపింది అని పోలిస్ అధికారులు చెప్పారు.

పరీక్ష మొదలు కాగానే ప్రశాంత్ దానిని లీక్ చేసి ముందుగా బండి కి, ఇతర బిజెపి సీనియర్ నాయకులకు పంపినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆ పేపర్ని వాట్స్ అప్ ద్వారా చాలా మందికి పంపాడు. అక్కడితో ఆగక దానిని మీడియాకు పంపి వార్తలు రాయమని కోరాడు. స్క్రోలింగ్ అతనే రాసి మీడియాకు పంపాడు.

రిమైండ్ ఖైదీగా జైలుకు వెళ్ళిన బిజెపి నేత బండి సంజయ్ నిజంగా నేరం చేశారా? లేక ఇది బిఆర్ఎస్ రాజకీయ కుట్రా? అని పక్కన పెడితే, కుటిల రాజకీయ చదగంగంలో విద్యార్థులు పావులుగా మారారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం తెలంగాణాకు మరొకటి లేదు.

Exit mobile version