Site icon Polytricks.in

బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దు..?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దుకాక తప్పదా? పదో తరగతి హిందీ పరీక్షా పత్రాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే లీక్ చేసినట్లు వరంగల్ పోలీసులు తేల్చడంతో ఆయన పదవికి ఎసరు ఖాయమనిపిస్తోంది.

పేపర్ లీక్ లో బండి సంజయ్ ను ఏ 1 గా చేర్చిన పోలీసులు.. క్వశ్చన్ పేపర్ ను వాట్సప్ లో వైరల్ చేసిన నిందితుడు ప్రశాంత్ తో, బండి సంజయ్ పేపర్ లీక్ ముందు రోజు పలుమార్లు మాట్లాడినట్టు గుర్తించారు. వాట్సప్ చాటింగ్ చేసినట్టుగా తేల్చారు. పేపర్ లీక్ పక్కా పథకం ప్రకారమే జరిగిందని నిర్ధారించిన పోలీసులు ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేరుస్తూ.. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌ేన్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 తో పాటు, ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో ఈ కేసు చాలా కాంప్లీకెటేడ్ గా మారేలా కనిపించడమేగాక.. బండి సంజయ్ ఎంపీ పదవికి కూడా ప్రమాదం పొంచి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పేపర్ లీక్ వ్యవహారం క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో బండి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు… ఆయన్ను మరింత లోతుగా విచారణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో బండి సంజయ్ పాత్ర ఉందని తేలితే.. ప్రభుత్వాన్ని ఆస్తిరపరిచేందుకే బండి ఈ విధమైన కుట్ర చేశాడని పోలీసులు నిరూపించగలిగితే, ఆయనకు 3 నుంచి 7 సంవత్సరాలకు వరకు శిక్ష పడొచ్చని స్వయంగా పోలీసులే చెబుతున్నారు. అదే జరిగితే ఆయన పదవి పోవడం ఖాయం.

కేవలం ఓ రాజకీయ విమర్శ చేసిన కేసులో రాహుల్ గాంధీని దోషిగా గుర్తిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. అది జరగగానే ఆయన లోక్ సభ కార్యాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ దోషిగా తేలితే కూడా ఆయనకు పదవి గండం తప్పదు. మరోవైపు ఈ కేసు విషయంలో విచారణ పూర్తై.. కోర్టు తీర్పు వెలువరించే వరకు పుణ్యకాలం కాస్త గడిచి ఎన్నికలు సమీపించే అవకాశం ఉండొచ్చునని అంటున్నారు.

సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల కేసుల్లో వ్యవస్థలను కేంద్రంలోని పెద్దలు మేనేజ్ చేస్తున్నారని, తమ వారి విషయంలో మాత్రం ఆలస్యం చేస్తారనే అపవాదు ఉండనే ఉంది. కాబట్టి ఇదే నిజమైతె బండి సంజయ్ పదవికి ఎలాంటి డోఖా లేనట్టే అంటున్నారు అనలిస్టులు.

Also Read : టెన్త్ పేపర్ లీక్ వెనక బీజేపీ హస్తం..?

Exit mobile version