Site icon Polytricks.in

బండి సంజయ్ అరెస్ట్ ఓ డ్రామా- బెయిల్ మంజూరుకు సర్కార్ లైన్ క్లియర్..?

టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయా..? పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవడంతోనే ఈ అంశాన్ని తెరమరుగు చేసేందుకే బండిని జైలులో వేశారా? ప్రశ్నా పత్రాల లీక్ వివాదంలో బీఆర్ఎస్ పై పోరాటం చేస్తోన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుండటంతోనే ఈ వ్యవహారంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేయించారా? అంటే అరెస్ట్ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది.

టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో మంగళవారం అర్దరాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే బండి సంజయ్ అరెస్ట్ జరిగిందనేది చెప్పాల్సిన పని లేదు. అయితే పేపర్ లీక్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ను చర్చలో లేకుండా చేసేందుకు ఈ అరెస్ట్ చేయించినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బలపడితే బీఆరెస్ ఖాళీ అవుతుంది గనుక బీజేపీకి మైలేజ్ పెంచాలనే వ్యూహంలో భాగంగా బండి సంజయ్ అరెస్ట్ కు సర్కార్ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్లుగా కనబడుతోంది.

నిజంగా సర్కార్ కు పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ను కటకటాల పాలు చేయాలనుకుంటే అరెస్ట్ చేసేముందు పాటించాల్సిన నిబందనలను పాటించాలని ఆదేశించేవారు. కానీ ఆ దిశగా సర్కార్ ఆదేశించలేదు. పోలీసులు కూడా ప్రొసీజర్స్ పాటించలేదు. కాబట్టి ఈ లొసగులను  వాడుకొని బండి సంజయ్ ఈ కేసు నుంచి బెయిల్ పై విడుదలయ్యేందుకు సర్కారే మార్గం సుగమం చేసినట్లు క్లియర్ గా అర్థం అవుతోంది.

బండి సంజయ్ ను అరెస్ట్ చేసే ముందు ఎలాంటి నిబంధనలను పోలీసులు పాటించలేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో, ఆ కేసు బెయిలబులా? నాన్ బేలబులా? అనేది అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు సెక్షన్ 50, సీఆర్పీసీ ప్రకారం అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తికి చెప్పాలి. లేదా సెక్షన్ 75 సీఆర్పీసి ప్రకారం అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి. అరెస్ట్ చేసే ముందు ‘అరెస్ట్ మెమో’ పై కుటుంబ సభ్యులతో లేదా స్థానికంగా ఉండే వారితోనైనా ఓ సాక్షి సంతకం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరినైనా అరెస్ట్ చేసేముందు పోలీసులు తప్పకుండా పాటించాల్సిన నిబంధనలు ఇవి.

కేస్ ఎంత సీరియస్ అయినదైన వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తే అది అంతిమంగా అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ అరెస్ట్ విషయంలోనూ పోలీసులు ప్రొసీజర్స్ ఏమి పాటించలేదని కుటుంబ సభ్యులు, బండి సంజయ్ తరుఫు న్యాయవాదులు ప్రధానంగా చెబుతున్నారు. బండిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తే పోలీసులు ఎలాంటి కారణం చూపలేదు. కాబట్టి బండి సంజయ్ అరెస్ట్ సమయంలో పాటించాల్సిన ప్రొసీజర్స్ ను పోలీసులు పాటించలేదని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపి…సంజయ్ ను బెయిల్ పై బయటకు తీసుకొస్తారు. పేపర్ లీక్ అనేది క్రిమినల్ కేసు. ఇంత తీవ్రమైన కేసులో  ఆయన అరెస్ట్ సందర్భంగా పోలీసులు నిబంధనలను పాటించకపోవడంతో బండి సంజయ్ కు  బెయిల్ చాలా తొందరగా లభ్యం కానుంది.

పేపర్ లీకేజీ అనేది లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అటువంటి కేసులోనూ పోలీసులు జాగ్రత్తగా ఉండకపోతే నిందితులు ఈ టెక్నీకల్ కారణాల మీద తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని పోలీసులకు , ప్రభుత్వానికి తెలియనిది కాదు. రాజాసింగ్ ను గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి నిబంధనలను పాటించలేదనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని 41 సీఆర్పీసి కింద నోటిసులు ఇచ్చి ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ విషయంలో మాత్రం ఈ నిబంధనలను గాలికి వదిలేశారు. కేసు సీరియస్ అయినదని తెలిసినా నిబంధనలను పాటించలేదంటే సర్కార్ వ్యూహం ఏంటో రాజకీయాలపై అవహగన ఉన్న వారికీ యిట్టె అర్థం అవుతుంది.

కాంగ్రెస్ బలపడితే బీఆరెస్ ఖాళీ అవుతుంది గనుక బీజేపీకి మైలేజ్ పెంచుతుంది బీఆర్ఎస్. కానీ ఇలాంటి సీరియస్ అంశాల్లో సర్కార్ రాజకీయ ప్రయోజనాలు ఆశించడమే ఏమాత్రం బాగోలేదు. విజ్ఞులైన ప్రజలే ఈ విషయాలను ఆలోచించాలి.

Exit mobile version