వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ అవతార్ 2’. ఈ నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా…ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం స్టార్ట్ డైరక్టర్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. అతనెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎలాంటి రికార్డ్ లు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. 2009లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. దీంతో ఆయన మరో ప్రాజెక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటుంటే …అవతార్ 2,3,4,5 ఉంటుందని చెప్పేశాడు.దీంతో అవతార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త వైరల్ అవుతోంది.
అవతార్ 2 తెలుగు వర్షన్ కోసం అవసరాల శ్రీనివాస్ పని చేశాడు. ఇందులో డైలాగ్స్ అన్ని ఆయనే రాశాడు. ఈ విషయం ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
అవతార్ 2లో డైలాగ్స్ మనోడివే..!
