Site icon Polytricks.in

క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా..తప్పక మీరు తెలుసుకోవాల్సిన వివరాలివే..!

ఎరను చూసి ఓ చేప ‘అమ్మా! మనుషులు దయామయులు, మనకోసం ఎరను వేసి తినమంటున్నారు’ అని మురిసిపోతుంది.

‘ఆ ఎరను వేసింది మనం తినేందుకు కాదు, మనల్ని పట్టుకుని వాళ్లు తినేందుకు’ అని తల్లి చేప చెప్పింది. అయినా పిల్ల చేప వినకుడా ఎరను తినబోయి దొరికిపోయింది.

క్రెడిట్ కార్డుల ఎర కూడా ఇలాంటిదే. అది తీసుకోవడం ఒక శిక్ష లా మారుతుంది. తీసుకున్న అప్పును 50 రోజులల్లో చెల్లిస్తే ఎలాంటి వడ్డీలు పడవు అని అందరూ తీసుకుంటారు. కానీ అది 99 శాతం మందికి ఆర్టిక ఇబ్బందుల వల్ల వీలుకాదు. అసలు ఆర్టిక ఇబ్బందులు లేని వాళ్లు క్రెడిట్ కార్డ్ జోలికే పోరు. అనుకున్నది ఒక్కటి, జరిగేది మరొకటి. అదే క్రెడిట్ కార్డ్ మహత్యం.

పలానా హోటల్లో రూ. 2000 వేలు బిల్ చేస్తే, 2౦ శాంతం క్యాష్ బ్యాక్, పాలనా కంపెనీలో రూ. 5000 బట్టలు కొంటె 40 శాతం డిస్కౌంట్ లాంటి ప్రకటనలు మిమ్మల్ని ఉరిస్తాయి. ఆ మాటకొస్తే క్రెడిట్ కార్డే పెద్ద ఎర. దానికి చిక్కితే ఎలాంటి చిక్కులు ఉంటాయో ఎస్ ఏ జి ఇన్ఫో టెక్ ఎం డి అమిత్ గుప్త చక్కగా వివరించారు.

హిడెన్ చార్జీలు (రహస్య చార్జీలు)

క్రెడిట్ కార్డ్ ఉన్న లక్ష మందితో  ‘హిడెన్ చార్జీలు’ అంటే ఏమిటో తెలుసా? అని అడగండి. 90 శాతం మంది తెలియదు అంటారు. ఆ మాటకొస్తే బ్యాంకు అధికారులకు కూడా తెలియదు. అంటే రహస్య చార్జీలు. ఈ వంకతో మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చినందుకు ఏడాదికి రూ. 5OO నుంచి ఎంతయినా వసూలు చేస్తారు. ప్రింట్ చేసిన కార్డ్ చార్జీలు ఉండవచ్చు. మీకు పంపిన ఎస్ఎంఎస్ చార్జీలు కావచ్చు, వాట్స్ అప్ చార్జెస్ కావచ్చు. మీకు క్రెడిట్ కార్డ్ నుంచి ఫోన్ కాల్ చేసిన దానికి చార్జీలు కూడా కావచ్చు. వాటి గురించి అడిగే హక్కు మీకు లేదు. కోర్ట్ లో దాని గురించి వాదించే హక్కు కూడా లేదు.

మెయింటనేన్స్ చార్జీలు

మీకు పాయింట్స్ ఆశ కల్పిస్తారు. ఎక్కువ పాయింట్స్ సాదిస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి అంటారు. ఈ ఎక్కువ పాయింట్లు రావాల్లంటే మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డ్ మీద అప్పులు చేయాలి. ఎక్కువ క్యాష్ తీసుకోవాలి. అంటే కిళ్ళి ఉచితంగా ఇష్టము, బిర్యానీ తినండి అనే పద్దతి. కుడి చేత్తో దానం చేస్తూ ఎడమ చేతితో జేబులు కోస్తారు. ఎటు చూసినా వాళ్ళకే లాభం ఉంటుంది. ఇందులో 365 రోజులకు గాను జాయింట్ ఫీజులు వసూలు చేస్తారు. మాన్యువల్ ఫీజులు కూడా ఉంటాయి. మీరు చేసిన అప్పుల మీద వడ్డీలు, ఆ వడ్డిల మీద సర్విస్ టాక్స్, లేట్ ఫీ, పెనాలిటి, సర్ ఛార్జ్ లాంటివి అనేకం ఉంటాయి. ఆర్బిఐ నిబందలను తొంగలో తొక్కుతారు. అసలు మీరు కోర్ట్ కి వెళ్ళితే కదా వాళ్ళ వడ్డీల గురించి బయటపడేది.

క్యాష్ అడ్వాన్సు ఫీ

ప్రతి క్రెడిట్ కార్డ్ కి ఓ లిమిట్ అమౌంట్ ముందుగానే ఫిక్స్ చేస్తారు. అంటే మీ లిమిట్ రూ. 50,000 అనుకోండి. అందులో రూ. 25,000 మీరు క్యాష్ తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి డబ్బు ఎటిఎం నుంచి తీసుకుంటే మినిమం ఛార్జ్ రూ. 500 నుంచి మొదలవుతుంది. మీరు రూ. 500 ఎటిఎం నుంచి తీసుకున్నా రూ. 500 చార్జ్ పడుతుంది. అంటే 100 శాతం వడ్డీ పడుతుంది. దీని మీద వడ్డీ 2.5 నుంచి మొదలవుతుంది. ఒక్క కిస్తి లేట్ గా కడితే వడ్డీ మీద చక్ర వడ్డీ, దాని మీద ఆ వడ్డీ, ఈ వడ్డీ అని పట్టపగలే చుక్కలు చూపిస్తారు. క్రెడిట్ కార్డ్ మీద క్యాష్ తీసుకోవడం అంటే కందిరీగ తొట్టిని కెలకడం లాంటిదే. దానికి జోలికి పోవద్దు.

ఇక మీరు మీ క్రెడిట్ కార్డ్ తో అమెరికా లాంటి దేశాలకు డబ్బులు చెల్లిస్తే ఆ ఇంటర్నేషనల్ వడ్డీలు వేరుగా ఉంటాయి. అమెరికాతో పోల్చితే రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి ఆ లోటు మన దగ్గర ప్రతి నెల వసూలు చేస్తారు. దీని మీద రకరకాల టాక్స్ లు ఉంటాయి.

అప్పులు లేనివాడు అధిక సంపన్నుడు అన్నది పాత సామెత. క్రెడిట్ కార్డ్ లేనివాడే అధిక సంపన్నుడు అన్నది కొత్త సామెత.

Exit mobile version