Site icon Polytricks.in

హత్యా రాజకీయాలకు కేరాఫ్ గా ఏపీ..!?

రాజు నీతిమంతుడైతే ఆయన పరివారం కూడా నీతిమంతంగా ఉంటుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు రాక్షసుడు అయితే ఆయన పరివారం జనాన్ని పీక్కుతినే రాబందులుగా మారి… మారణకాండ సృష్టిస్తారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు అచ్చుగుద్దినట్లు అలానే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలకు కేరాఫ్ గా మార్చేశారు.

ప్రశ్నించేవాళ్లను బెదిరించడం… ఎదురుతిరిగితే వేసేయడం పరిపాటిగా మారింది. అధికారం కోసం సొంత బాబాయ్ నే కడతేర్చిన చరిత్ర వైసీపీ అధినాయకుడిది అయితే… నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం, అవసరమైతే అడ్డు తొలగించడం ఆయన పరివారంకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న డ్రైవర్ సుబ్రమణ్యం కేసును సీబీఐకి అప్పగించాలని డ్రైవర్ తల్లిదండ్రులు కోర్టులో పిటీషన్ వేయడం చూస్తే ఇది మరో వివేకా హత్య కేసులా మారుతోందని తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా విచారణ జరపడం లేదని ఆయన కుమార్తే సునీత సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయస్థానాలను కోరింది. ఆమె అభ్యర్ధన మేరకు న్యాయస్థానాలు కూడా సీబీఐతో వివేక కేసును విచారణ జరిపిస్తున్నాయి. ఇప్పుడు డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో ఆయన తల్లిదండ్రులు సీబీఐ విచారణ కోరుతున్నారంటే అర్ధం ఏమిటి?

హత్యతో సంబంధం ఉన్నవాళ్లు చాలా మంది తప్పించుకున్నారని వాళ్లు భావిస్తున్నారా? అసలు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏమైంది? దాని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సీబీఐ రంగంలోకి దిగాల్సిందే. హత్య వెనుక ఉన్న కారణాలను ప్రజల ముందు బయట పెట్టాల్సిందే.

Exit mobile version