Site icon Polytricks.in

బిజెపి కి మరో షాక్; ఈటల రాజేందర్ కూడా అరెస్ట్?

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని 14 రోజుల రిమైండ్ కస్టడి విదిస్తూ కోర్ట్ నిన్న  జైలులు పంపింది. ఇది గడిచి 24 గంటలు గడువకముందే బిజెపికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.

హుజురాబాద్ బిజెపి ఏమ్మెల్లె ఈటల రాజేందర్ చుట్టూ ఈ కేసు బిగిస్తోంది. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో ప్రధాన నిందుతుడిగా ప్రశాంత్ ని పోలీసులు నిన్న తమ పద్దతిలో విచారించారు. ఆ ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ ముందుగా ఈటల రాజేందర్ కు పంపినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండి సంజయ్ కి పంపినట్లు వాట్స్ ఆప్ డేటాలో తెలిసింది.

అందుకే ఈసారి ఈటల రాజేందర్ని కూడా కేసులో నమోదు చేస్తూ ఈరోజు ఉదయం పోలీసులు నోటిసులు పంపారు. ఇప్అపుడు అతను చెప్పే వివరాలను అధికారికంగా రికార్డ్ చేసి, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోడానికి వరంగల్ సిపి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

అయితే బండి సంజయ్ విషయంలో చూపిన హడావుడి ఈటల రాజేందర్ విషయంలో చేయకూడదు అని పోలీసులు భావిస్తున్నారు. కేసు చాలా బలంగా ఉంది. ఆధారాలు ఇంకా బలంగా ఉన్నాయి. నోటిసులు ఇచ్చి, ఆ తర్వాతే ఈటల రాజేందర్ ని అరెస్ట్ చేయడానికి రంగం దాదాపు సిద్దం అయింది.

Exit mobile version