Site icon Polytricks.in

ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద పోస్ట్ చేశారంటూ రాజసింగ్ కు నోటిసులు పంపారు.

దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా నోటిసుల్లో పేర్కొన్నారు పోలీసులు. రాజాసింగ్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంగళ్ హాట్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.

డిసెంబర్ 6న అయోధ్య, అక్బర్ పై ట్వీట్లు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. పీడీ యాక్ట్ కొట్టేసిన సమయంలో హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని ఆయనకు మంగళ్ హాట్ పోలీసులు నోటిసులు ఇచ్చారు.

ఆ ట్వీట్లపై రాజాసింగ్ తరుఫు న్యాయవాది వివరణ ఇచ్చినా..పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో రాజాసింగ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మంగళ్ హాట్ పోలీసులు.

Exit mobile version