Site icon Polytricks.in

‘బండి సంజయ్’కి హై కోర్ట్ లో మరో ఎదురు దెబ్బ?

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని నిందితుడిగా నమ్మిన హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్ట్ జడ్జి రాపోలు అనిత నిన్న అతనికి 14 రోజుల రిమాండ్ కస్టడి విదిస్తూ జైలులు పంపిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్ర రావు ఈ రోజు గురువారం తెలంగాణ హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ కోర్ట్ ఇచ్చన తీర్పును రద్దు చేసి, బండిని విదుల చేయాలనీ ఆయన వాదించారు.

అతనిని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తగిన వివరణ ఇచ్చారు. ఇద్దరి వాదనలు విన్న హై కోర్ట్ జెస్టిస్ ఉజ్జల్ భుయాన్ కింది కోర్టు తీర్పును కొట్టేయలేదు. బండిని విడుదల చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

అయితే బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పత్రాన్ని ఎలా లీక్ చేసినట్లు? ఒక్కసారి విడుదల అయ్యిన ప్రశ్నా పత్రం, వాట్స్ అప్ ద్వార జనంలోకి వెళ్ళినంత మాత్రాన జరిగిన నష్టం ఏమిటి? అని సూటిగా అడ్వకేట్ జనరల్ ని జెస్టిస్ అడిగారు.

అది కూడా నిజమే. పరీక్ష కంటే పేపెర్ లీక్ అయితే మాస్ కాపింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ విద్యార్థులు పరీక్ష హాలులో కూర్చున్న తర్వాత, అల్ రెడీ అందరు పేపర్ చదివేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళినా ఎలాంటి నష్టం లేదు. బయటినుంచి విద్యార్థులు జవాబులు తెచ్చుకుని పరీక్షా హలులోపలికి  వచ్చి పరీక్ష రాసే అవకాశం లేదు అని లోగడ మేము రాసిన వార్తను నిజం చేస్తూ జెస్టిస్ ఇలాగే అడిగారు.

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దీని మీద పెద్దగా వాదించకులేదు. అయితే రేపటినుంచి పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్ల ముందు నిరాహార దీక్షలు చేసి పరీక్షలు జరగకుండా అడ్డుకోవాలి అని బండి ఇచ్చిన ఆదేశం గురించి, రోజుకో పరీక్షాపత్రం విడుదలచేసి కెసిఆర్ ప్రభుత్వాన్ని అల్లరి ప్లాన్ చేయాలి అనే కుట్రను బండి సంజయ్ చేసినట్లు వాదించారు. అతను బయట ఉంటే ఇలాంటి కుట్ర అమలు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని గట్టిగానే వాదించారు.

ఈ వాదనల అనంతరం జెస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలనీ పోలీసులను ఆదేశించారు. ప్రశాంత్, బండికి మధ్య జరిగిన మాటలను, వాట్స్ అప్ మెసేజ్లు  ఇంకా తన దగ్గరికి రాలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి, అంటే ఈ నెల 10 వ తేదీకి వాయిదా వేశారు.

అయితే శనివారం ప్రధాని మోడీ నగరానికి వస్తున్నారు. అందుకే బండిని విడుదల చేయాలని కింది కోర్టులో కేసు వేశారు రామచంద్ర రావు. కోర్ట్ దానిని వెంటనే విచారణకు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హై  కోర్ట్ ని కోరారు. కింది కోర్ట్ లో బెయిల్ రాకపోతే హై కోర్ట్ లో హౌస్ మోషన్ పిటిషన్ వేయవచ్చు అని జెస్టిస్ సూచించారు. అయితే రిమాండ్ క్యాష్ పిటిషన్ మీద విచారణ మాత్రం ఈ నెల 10 న జరుగుతుంది అని చెప్పారు.

Exit mobile version