Site icon Polytricks.in

ఫలించిన వైద్య శాస్త్రవేత్తల ప్రయోగం? ఇక అంధులు ఉండరా?

అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు కళ్ళు తేవాలని ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి  పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు కనుగున్న వివిధ బయోనిక్ సొల్యూషన్‌లు ఇంకా పెద్ద ఎత్తున అంధులకు సహాయం చేయలేకపోయాయి.

అంధులు మళ్లీ చూడగలిగేలా వ్యవస్థను రూపొందించామని మోనాష్ యూనివర్సిటీ బృందం ప్రకటించి ప్రపంచాన్ని నివ్వేర పరిచింది. ఇది ప్రపంచంలోనే మొదటి బయోనిక్ కన్ను. అంటే సింపుల్ గా మనకు తెలిసిన భాషలో చెప్పలేంటే డిజిటల్ కన్ను. ‘జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్’గా పిలువబడే ఈ ‘బయోనిక్ కన్ను’ దాదాపు పదేళ్లుగా అభివృద్ధిలో ఉంది. ఇది రెటీనా నుండి మెదడు యొక్క దృష్టి కేంద్రానికి సంకేతాలను ప్రసారం చేయడానికి, దెబ్బ  తిన్న ఆప్టిక్ నరాలను దాటవేయడం ద్వారా పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.

కన్ను సైజులో ఉండే ఈ కెమెరాను, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్‌ను అంధుల కంటి పుర్రెలో ఇన్‌స్టాల్ చేస్తారు.  కస్టమ్-డిజైన్ హెడ్‌గేర్‌ను వీళ్ళు విధిగా ధరించాలి. పైన పేర్కొన్న రిసీవర్ నుండి సంకేతాలను స్వీకరించే మెదడులో 9 మి.మీ టైల్స్ అమర్చబడి ఉంటాయి.

మోనాష్ యూనివర్శిటీ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఆర్థర్ లోవరీ ఒక ప్రకటనలో ఇలా అన్నారు, “మా డిజైన్ 172 మచ్చల కాంతి (ఫాస్ఫెన్స్) కలయిక నుండి దృశ్యమాన నమూనాను సృష్టిస్తుంది. ఇది వ్యక్తికి ఇండోర్ మరియు అవుట్‌డోర్ నావిగేట్ చేయడానికి సమాచారాన్ని అందిస్తుంది. పరిసరాలు, వాటి చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువుల ఉనికిని ఇది గుర్తించి మెదుకు సంకేతాలు సిగ్నల్స్ గా  పంపుతుంది. దాంతో కన్ను పనిచేయడం మొదలుపెడుతుంది” అని వివరించారు.

అయితే దీని ఖర్చు ఇప్పుడు భారీగా ఉంటుంది. మునుముందు దీని ధర చాలా తగ్గుతుంది అని చెప్పారు.

Exit mobile version