Site icon Polytricks.in

‘యూ’ట్యూబ్ చూసి కాన్పు చేసుకుని…ప్రాణం మీదకి తెచ్చుకుని…

మహారాష్ట్ర లోని నాగపూర్లో ఓ ఘోరం జరిగింది. 15 ఏళ్ల అమ్మయి ఒకడి ప్రేమకు బలయ్యింది. అతను అంబజారి ప్రాంతానికి చెందినవాడు. ‘తొందర పడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్లు ఆమె అతనితో తొందరపడింది. కాలు జారింది. కడుపు వచ్చింది. అతను పెళ్లి చేసుకుంటాడు అనుకుంది. కానీ చేసుకోలేదు. ఆ కడుపును తీసేయడానికి అవకాశం లేదు. అప్పటికే ఐదో నెల.

ఎత్తుగా పెరుగుతున్న కడుపుని చూసి ఆమె తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. కడుపులో పెరిగేది బిడ్డ కాదు, గడ్డ అని నమ్మించింది. కాన్పు చేసుకోడానికి ఆసుపత్రికి వెళ్ళితే వివరాలు అడుగుతారు. అందుకే ‘యూ’ట్యూబ్లో వచ్చే ‘కానుపులు ఎలా చేయాలి?’ అనే ప్రోగ్రాం చూసింది. చివరకి తనకుతానే డాక్టర్ లా మరి కాన్పు చేసుకుంది.

అక్కడివరకు బాగానే ఉంది. ఇప్ఆపుడు ఆ  బిడ్డను ఎలా పెంచి పెద్ద చేయాలో ఆమెకు అర్థం కాలేదు. తాను ఓ తల్లిని అని మరిచింది. ఆడది అని ఎప్పుడో  మరిచింది. కనీసం ఒక్కసారి కూడా రొమ్ము తెరిచి గుక్కెడు పాలు కూడా ఇవ్వలేదు. ఓ కసాయి దానిలా  నవమాసాలు మోసి కన్న  శిశువు గొంతు నులిమి చంపేసింది. ఆ శవాన్ని చూసి ఆమె కళ్ళు చేమ్మగిల్లలేదు. పీడ విరగడయ్యింది అన్నట్లు సంతోషించింది. ఆ మృత దేహాని ఓ పెట్టెలో దాచి పెట్టింది. కర్మకాండ దేవుడు ఎరుగు. దానిని తీసుకునివెళ్లి మురికి కాలువలో పడేసి చేతులు దులుపుకోవాలని  ఆమె కర్ణ కఠోర  ప్లాన్.

కానీ ఇంతలో ఆమె తల్లి వచ్చింది. ఆమెకు అనుమానం వచ్చింది. ఆమె కూడా ఓ బిడ్డను కన్న తల్లే. తన బిడ్డ మరో బిడ్డకు జన్మ ఇచ్చింది అని గ్రహించింది. పెట్టే తెరిచి చూసి లబోదిబోమంది. ఆ పశువును కొట్టింది. మానవత్వానికే కాదు, యావత్తు స్త్రీ జాతికే మచ్చ తెచిన ఆ అమ్మయి జుట్టుపట్టి రోడ్డుమిడికి ఈడుచుకువచ్చింది. బాధ్యత తెలిసిన ఓ తల్లిలా తన బిడ్డ మీద హత్య నేరం కింద పోలీస్ కేస్ పెట్టింది.  పోలీసులు అన్ని కోణాలలో కేసుని పరిశోధిస్తున్నారు.

మనం తరతరాలుగా చదువుతున్న మహాభారతంలో ఎన్నో నీతికథలు ఉన్నాయి. ఇలాంటి దిక్కుమాలిన పనులకోసం కూడా చక్కని కథలు ఉన్నాయి. అందులో కుంతి కథ ఒకటి. కుంతి కూడా కామం తట్టుకోలేక పెళ్ళికి ముందే సూర్యుడితో అక్రమ సంభందం పెట్టుకుని కాలు జారి, కడుపు తెచ్చుకుంది. ఫలితంగా కర్ణుడిని కన్నది. కానీ ఆ కర్ణుడిని ఆమె ఇలా చంపలేదు. ఓ పెట్టెలో పెట్టి గంగపాలు చేసి చేతులు కడుక్కుంది.

ఇందులో ఉన్న నీతి ఏమిటో ఆ అమ్మాయి గ్రహిస్తే ఇలా పోలీసు కేసులో ఇరుక్కోదు. మనం చేసే ప్రతి అడ్డమైన పనికి మహాభారతంలో సూచనలు, సలహాలు, నీతులు ఎన్నో ఉన్నాయి. అందుకే దానిని ‘మహాభారతం’ అన్నారు.

Exit mobile version